
చిరకాలం గుర్తుండేలా..
పెళ్లి విషయంలో తల్లిదండ్రులు, పిల్లల అభిరుచులు మారుతున్నాయి. జీవితంలో పెళ్లి అరుదైన ఘట్టం. చిరకాలం గుర్తుండిపోయేలా ఘనంగా చేసుకుంటున్నారు. అధునాతన సెట్టింగులు, కొత్త పోకడలకు అనుగుణంగా పెళ్లి మంటపాలను సిద్ధం చేయాలని కోరుతున్నారు.
– రాకుర్తి ప్రసాద్, సత్యనారాయణ గార్డెన్స్ యజమాని, అమలాపురం
అభిరుచికి తగినట్టుగా..
పెళ్లిళ్లు చేసే తీరు మారిపోతోంది. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేదు. పెళ్లి తంతులో ప్రతి సందర్భం అద్భుతంగా గుర్తుండిపోవాలని కోరుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో పెళ్లిళ్ల సెట్టింగులను చూసి, తమకు కూడా అలాగే చేయాలని కోరుతున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడిని చేయడం, ఊరేగింపు, సంగీత్, బరాత్.. ఇలా అన్ని కొత్తదనం, ఆర్భాటం కనిపించాలని కోరుకుంటున్నారు.
– కొవ్వూరి ధర్మారెడ్డి, ఎస్‌వీ ఈవెంట్స్, రావులపాలెం

చిరకాలం గుర్తుండేలా..
Comments
Please login to add a commentAdd a comment