పెదపూడి: జి.మామిడాడ గ్రామంలో జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల్లో గ్రేడ్–2 ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కోరుమిల్లి తులసి ఆలిండియా సివిల్ సర్వీసెస్ గేమ్స్ జాతీయ స్థాయి ఖోఖో జట్టుకు క్రీడాకారిణిగా ఎంపికయ్యారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్తి వెంకటరెడ్డి గురువారం మాట్లాడుతూ ఆల్ ఇండియా సవిల్ సర్వీసెస్ గేమ్స్ మీట్‌లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఖోఖో జట్టుకు క్రీడాకారిణిగా ప్రాతినిధ్యం వహించనున్నారన్నారు. ఆమె ఈ నెల 19 నుంచి 24 వరకు ఢిల్లీలో జరుగుతున్న పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. ఆమె 2024 నవంబర్7న విజయవాడలో జరిగిన ఖోఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభతో జాతీయ జట్టులో స్థానం సంపాదించారని తెలిపారు. ఆమెను పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.
గేట్‌లో శ్రీగౌతమ్‌కు నాలుగో ర్యాంక్
పెదపూడి: జి.మామిడాడ గ్రామానికి చెందిన పోతురాజు శ్రీగౌతమ్ బుధవారం విడుదలైన గేట్–2025 ఫలితాల్లో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆల్‌ఇండియాలో నాలుగో ర్యాక్ సాధించాడని తండ్రి సాయి వెంకటేశం తెలిపారు. ఆయన గురువారం జి.మామిడాడలో మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్‌లో మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పట్టుదలగా చదివాడన్నారు. సంవత్సరం నుంచి చేస్తున్న ఉద్యోగానికి ఐదు నెలల క్రితం రాజీనామా చేసి ఇంటికి వచ్చాడన్నారు. ఈ ఐదు నెలలుగా ఇంటి వద్ద ఉండి ప్రణాళిక బద్ధంగా చదివి ఈ ర్యాంక్ సాధించాడన్నారు. తల్లి గృహిణి కాగా తాను పైన గ్రామంలో ఎస్‌జీటి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నానని తండ్రి తెలిపారు.
వాసుకు పదో ర్యాంకు
అమలాపురం రూరల్: అమలాపురం రూరల్ మండలం బండారులంక చెందిన చేనేత కుటుంబానికి చెందిన పిచ్చిక కుమార్ వాసు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)–2025 ఫలితాల్లో పదో ర్యాంకు సాధించాడు. జాతీయస్థాయిలో వాసు మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 10 ర్యాంకు సాధించడంతో బండారులంకలో చేనేత కార్మికులు గురువారం బాణనంచా కాల్చి సంబరాలు చేశారు. చేనేత కార్మికులైన పిచ్చిక మల్లేశ్వరరావు, రేణుక వాణి కుమారుడు వాసు కష్టపడి రెండుసార్లు గేట్ రాసి ఈ ర్యాంకు సాధించాడు. 1 నుంచి 4వ తరగతి వరకు బండారులంక విజడమ్ స్కూలులో చదివి, భూపతిపాలెం గురుకుల పాఠశాలలో 10 తరగతి పూర్తి చేసి రాజమహేంద్రవరం శ్రీచైతన్యలో ఇంటర్మీడియెట్, నర్సారావుపేట జేఎన్టీయూలో బీటెక్ పూర్తిచేశానని వాసు తెలిపాడు. ఐఐటీ, ఎన్‌ఐటీలో ఎంటెక్ పూర్తిచేసి మంచి ఇంజీనీరుగా దేశానికి సేవలు అందిస్తానని అన్నాడు. గ్రామస్తులు వాసు తల్లిదండ్రులను ఊరేగించి వీరభద్రస్వామి ఆలయం వద్ద సత్కరించారు. శ్రీశైలం దేవస్థానం మాజీ ట్రస్టీ చింతా శంకర మూర్తి, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిచ్చిక శ్యామ్, ఉప్పుగుంటి భాస్కరరావు బళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కోటనందూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ గురువారం తెలిపారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చినగొలుగొండేకు చెందిన కాళ్ల వెంకటేశ్వర్లు(59) డీజిల్ తెచ్చుకునేందుకు టీవీఎస్ మోపెడ్‌పై కోటనందూరు బయలుదేరాడు. అల్లిపూడిలో బర్ల వరలక్ష్మికి లిఫ్ట్ ఇవ్వడం కోసం బండి ఎక్కించుకున్నాడు. అల్లిపూడి–కాకరాపల్లి రోడ్డులో జీడిపిక్కల ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసరికి ఎదురుగా ధాన్యం లోడుతో వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా, వరలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను 108 అంబులెన్స్‌లో నర్సీపట్నంలో ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడి కుమార్తె బొడ్డు నారాయణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆలిండియా ఖోఖో జట్టుకు తులసి ఎంపిక
ఆలిండియా ఖోఖో జట్టుకు తులసి ఎంపిక