కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఐదు జిల్లాల ప్రాంతీయ విద్యా సదస్సు ఈ నెల 23వ తేదీన రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నట్టు యూటీఎఫ్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పి.జయకర్ పేర్కొన్నారు. స్థానిక యూటీఎఫ్ హోమ్‌లో గురువారం జయకర్ అధ్యక్షతన సంఘ జిల్లా కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ పోరుబాట పోస్టర్‌ను ఆవిష్కరించారు. జయకర్ మాట్లాడుతూ ఆనం కళాకేంద్రంలో ఐదు జిల్లాల విద్యా సదస్సు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణకుమారి మాట్లాడుతూ 117 జీవో రద్దు, పాఠశాలల విలీనాలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.షరీఫ్ మాట్లాడుతూ ప్రభుత్వం బకాయి పడ్డ డీఏలను చెల్లించాలని, ఐఆర్‌ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ గౌరి, కోశాధికారి ఇవిఎస్‌ఆర్ ప్రసాద్, కార్యదర్శులు ఇ శ్రీమణి,దయానిధి, ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.