ముస్లింలకు ఇఫ్తార్ విందు
రాజమహేంద్రవరం సిటీ: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలు కఠిన నిబద్ధతతో చేసే ఉపవాస దీక్షలు అందరికీ స్ఫూర్తిదాయకమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ జక్కంపూడి గణేష్ అన్నారు. నగరంలోని ముస్లింలకు జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యాన హోటల్ ఆనంద్ రీజెన్సీ పందిరి హాలులో జక్కంపూడి గణేష్ శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, నగరంలోని ముస్లింలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చి, ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనందదాయకమని అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, నేతలు నందెపు శ్రీనివాస్, హబీబుల్లా ఖాన్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఆరీఫ్, కరీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ముస్లింలకు ఇఫ్తార్ విందు