కోకో గింజల ప్రాసెసింగ్
పులియ బెట్టడం: కోకో గింజలు చుట్టూ వున్న గుజ్జును తొలగించడానికి, మంచి సువాసన, రుచిని కలిగించడానికి పులియ బెట్టడం మంచి పద్ధతి. గింజలలో అమ్లతను 5.5కు తీసుకు రావడం, వగరు, చేదును తగ్గించడానికి, గింజలో మొలకను చంపడానికి, చుట్టూ వున్న పల్చని తొక్కను తొలగించడానికి పులియ బెట్టడం చాలా అవసరం. పెట్టె పద్ధతి, ట్రే పద్ధతి, బుట్ట పద్ధతి ద్వారా కోకో గింజలను పులియబెట్టడం మంచిది.
పెట్టె పద్ధతి
60 సెం.మీ. ఇన్‌టు 60 సెం.మీ. ఇన్‌టు 45 సెం.మీ. సైజు కరల్రతో చేసిన పెట్టెలు అవసరం. కారిన గుజ్జు పోవడానికి, గాలి తగలడానికి పెట్టె కింద రీపర్ బద్దలు నాటాల్సి ఉంది. తడి గింజలను పెట్టెలో దగ్గరగా అమర్చి అరటి ఆకులతో గాని (లేదా) గోనె సంచులతో గాని కప్పాలి. 24 గంటల తరువాత వేరే పెట్టెలోకి మార్చేటప్పుడు గింజలను మళ్లీ కలపాలి. సమానంగా పులవడానికి సరియైన ఉష్ణోగ్రత తేమ, గాలి ఉండేలా చూడడం ఎంతో అవసరం. పెట్టెలో 48 గంటల తరువాత ఉష్ణోగ్రత 42 నుంచి 48 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పెరుగుతుంది. పులియబెట్టిన 72 గంటల తరువాత గింజలను వేరే పెట్టెలోకి మార్చాలి. ఒక రోజు తరువాత చివరిగా గింజలను మార్చాలి. ఈ విధంగా పులియడానికి 6 రోజులు అవసరమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment