కొవ్వూరు: నందమూరు గ్రామానికి చెందిన కలివరపు చాణిక్య(36) సోమవారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బై పోలార్ అనే వ్యాధితో బాధపడుతున్న చాణక్య ఉదయం ఇంటి నుంచి బయల్దేరి రోడ్డు కం రైలు వంతెన పై నుంచి గోదావరి నదిలో దూకారు. పోలీసులు రెస్క్యూ టీము సహకారంతో నదిలో గాలించారు. ఎరినమ్మ ర్యాంపు సమీపంలో మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించినట్లు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య