కోకోకు ఇదే సీజన్
బుట్ట పద్ధతి
తడిగింజ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు వెదురు లేదా కేను బుట్టలను పులియబెట్టడానికి వాడుకోవచ్చు. వెదురుబుట్ట లోపలి అంచులను అరటి ఆకులతో కప్పాలి. బుట్ట అడుగుభాగం మాత్రం ఆకులతో కప్పకూడదు. బుట్టను గింజలతో నింపి అరటి ఆకులతో కప్పాలి. దానిపైన కొద్ది బరువును ఉంచాలి. బుట్టను నేలకు తగలకుండా కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంచడం వలన గింజలకున్న గుజ్జు సులభంగా బుట్ట అడుగు భాగం నుండి కారిపోతుంది. తరువాత బుట్టను గోనె సంచితో కప్పాలి. గింజలను 3వ, 5వ రోజున కలిపి, గోనె సంచితో కప్పాలి. ఆరు రోజులలో పులియడం పూర్తవుతుంది.
ఎండబెట్టడం: పులియబెట్టిన గింజలను పల్చగా సిమెంటు గచ్చు మీద గాని, వెదురు చాప మీద గాని 5 – 6 రోజుల వరకు ఎండబెట్టాలి. మధ్యలో గింజలను కలియబెడుతూ ఉండాలి. ఎండిన గింజలలో తేమ 67 శాతం మాత్రమే ఉండేలా చూసుకోవాలి.
● కోతలో మెళకువలు పాటించాలి
● గింజల గ్రేడింగ్‌తో అధిక ధరలు
● కోనసీమ జిల్లా ఉద్యాన శాఖ అధికారి రమణ
ఐ.పోలవరం: కోకో ఏడాది పొడవునా కాపు ఉన్నప్పటికీ మార్చి నుంచి మే నెలాఖరు అంటే మూడు నెలలపాటు అధిక దిగుబడులు వస్తాయి. ఈ సమయంలో వచ్చిన గింజలు అధిక నాణ్యత కలిగి ఉంటాయి. కోకో గింజల ధరలు పొందాలంటే విత్తనాల నాణ్యత పెంచాల్సి ఉంది. ఇందుకు ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించాలని చెబుతున్నారు జిల్లా ఉద్యాన శాఖాధికారి బి.వి.రమణ (89998 35469). కోకో గింజలకు జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నందున నాణ్యమైన గింజల ఉత్పత్తి చేసేందుకు రైతులు చేపట్టాల్సిన చర్యలను ఆయన వివరించారు. ఆయన మాటల్లోనే..
మన ప్రాంతంలో పండే కోకో గింజలకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ప్రపంచంలో గనా దేశం కోకో గింజన నాణ్యతలో ప్రథమస్థానంలో ఉండేది. దానిని ఇప్పుడు మనం అధిగమించాం. వాతావరణ పరిస్థితులు, మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా 2024లో కిలో నాణ్యమైన కోకో గింజలకు రికార్డు స్థాయిలో రూ.950 నుంచి రూ.1,000 వరకు ధర వచ్చింది. ఇప్పుడు ధర కొంత తగ్గినా మార్కెట్‌లో కేజీ ధర రూ.550 నుంచి రూ.650 వరకు ఉంటోంది. దీనివల్ల ఈ పంట రైతులకు పూర్తిగా లాభదాయకం. పైగా ఇది కొబ్బరి, ఆయిల్ పామ్ తోటలలో అంతర పంటగా సాగు చేస్తున్నందున రైతుకు అదనపు ఆదాయం వచ్చే పంట. కోకో చెట్టుకు అధికంగా ఆకు రాలుస్తుంది. ఈ కారణంగా రైతుకు రూపాయి పెట్టుబడి లేకుండా మంచి సేంద్రియ ఎరువు పొందే అవకాశముంది. ఇలా బహుళ ప్రయోజనాలు ఉన్న సాగుగా పేరొందిన కోకోలో మంచి దిగుబడి సాధిస్తే రైతులు మరింత లాభాలు పొందే అవకాశముంది. కోకోలో ప్రతి ఏటా రెండు సందర్భాలలో అధిక దిగుబడులు వస్తాయి. ఒకటి సెప్టెంబర్–జనవరి కాగా, రెండవది ఏప్రిల్–జూన్ మాసాలలో వస్తుంది. ఏప్రిల్ – జూన్ మాసాలలో వచ్చే దిగుబడి అధికంగా ఉంటుంది.
కృత్రిమంగా ఎండబెట్టడం
వర్షాకాలంలో గింజలను ఎండబెట్టటానికి విద్యుత్తు ఓవెన్స్ చాలా ఉపయోగపడతాయి. 72 నుంచి 96 గంటలలో గింజలు ఎండటం పూర్తవుతుంది. నెమ్మదిగా తక్కువ ఉష్ణోగ్రత వద్ద గింజలు ఎండటం వలన నాణ్యత బాగుంటుంది. ఓవెన్లో గింజలను 50–55 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద 8–10 గంటలు మాత్రమే మొదటి 2 రోజులు ఎండబెట్టాలి. తర్వాత 60 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద రోజంతా ఎండబెట్టవచ్చు. ఈ విధంగా 72 నుంచి 96 గంటలలో ఎండడం పూర్తవుతుంది.
గింజల గ్రేడింగ్.. నిల్వ చేయడం
ఎండబెట్టిన గింజల నుంచి తప్పలు, ముక్కలు, ముడుచుకు పోయిన గింజలు, రాళ్లు తీసివేసి పాలిథీన్ లైనింగ్ (150–200 గేజు) కలిగిన గోనె సంచులలో నిల్వ చేసుకోవాలి. ఈ సంచులను ఎత్తైన అరుగుల మీద ఉంచాలి.
కోకోకు ఇదే సీజన్
కోకోకు ఇదే సీజన్
కోకోకు ఇదే సీజన్
Comments
Please login to add a commentAdd a comment