
ముగిసిన రాష్ట్రస్థాయి ఖోఖో శిబిరం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటి): రాష్ట్ర ఖోఖో సంఘం సహకారంతో జిల్లా ఖోఖో సంఘం ఆధ్వర్యంలో పది రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి బాలికల ఖోఖో శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసింది. స్థానిక జేఎన్టీయూకే క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిబిరం ముగింపునకు డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్ కుమార్, జేఎన్టీయూకే స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి, పీడీ జి.శ్యాంకుమార్ అతిథులుగా హాజరై జాతీయస్థాయి పోటీలలో రాణించి పతకాలు సాఽధించాలన్నారు. జిల్లా ఖోఖో సంఘ కార్యదర్శి, శిబిరం నిర్వాహకులు, పీడీ పట్టాభి మాట్లాడుతూ ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 4 వరకు ఒడిశా రాష్ట్రం పూరిలో జరిగే 57వ ఆలిండియా పురుషులు, మహిళల ఖోఖో పోటీలలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు శిబిరం నిర్వహించి తుది జట్టును ఎంపిక చేశామన్నారు. ఇటీవల జరిగిన సవిల్ సర్వీస్ ఖోఖో పోటీలలో రజత పతకం సాధించిన పీడీలు ఎండీ ఇబ్రహీం, కిరణ్ కుమార్‌లను అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పీడీలు మహబూబ్ బాషా, శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర జట్టుకు కోచ్‌గా వాసు, మేనేజర్‌గా జి.పావని వ్యవహరిస్తున్నారు.