
నాగాంజలికి న్యాయం చేయండి
మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఫార్మసీ విద్యార్థిని నాగాంజలికి న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరారు. నాగాంజలి చికిత్స పొందుతున్న బొల్లినేని ఆసుపత్రికి రాజా వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, ఆమె పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో చక్కగా చదువుకునే నాగాంజలికి ఆ చదువే తనపాలిట శాపంలా తయారుకావడం బాధాకరమన్నారు. ఈ సంఘటనలో తల్లితండ్రులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు.
అంజలి కేసులో నిందుతుడ్ని కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయన్నారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరామన్నారు. అంజలి కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ఎప్పుడూ తనవంతు సహకారం ఉంటుందన్నారు.