
వ్యర్థాలతో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్
సామర్లకోట: స్థానిక ఏడీబీ రోడ్డులోని రిలయన్స్ పవర్ ప్లాంటు సమీపంలో రిలయన్స్ బయో ఎనర్టీ ప్లాంట్‌ను బుధవారం ఆన్‌లైన్ (వర్చువల్ విధానంలో)లో ప్రారంభించారు. డ్రోన్ కెమెరా ద్వారా ఫ్యాకర్టీ పరిసరాలను రిలయన్స్ అధినేతలు, మంత్రి లోకేశ్ తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. సుమారు రూ.375 కోట్ల వ్యయంతో నిర్మించే ప్లాంటులో వరి, చెరకు, మొక్కజోన్న, ఆయిల్‌పామ్, పూలతోటలు, ఆక్వా సముదాయాల నుంచి వచ్చే వ్యర్థాలు, పశువుల పేడతో ‘కంప్రెస్డ్ బయో గ్యాస్’ ఉత్పత్తి చేయడానికి ఈ యూనిట్ ఏర్పాటు చేశారు. సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే మూడు యూనిట్ల ద్వారా రోజుకు 67.53 టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేయనున్నట్లు రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ ప్రతినిధులు తెలిపారు. బయో ఎనర్జీ మొదటి యూనిట్ ప్లాంటుకు రూ.114.20 ఖర్చు చేసినట్టు ఫ్యాక్టరీ ప్రతినిధులు చెప్పారు. మిగిలిన రెండు యూనిట్లు ఆగస్టు నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తాయని తెలిపారు.
వర్చువల్ విధానంలో
ప్రారంభించిన మంత్రి లోకేశ్