
బెల్లపు బట్టీలపై విజిలెన్స్ దాడులు
రూ.38 లక్షల విలువైన
నాసిరకం బెల్లం, పంచదార స్వాధీనం
కొవ్వూరు: వాడపల్లి గ్రామంలో బెల్లం బట్టీలపై విజిలెన్స్ అండ్ ఎన్‌పోర్సుమెంటు అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ డీఎస్పీ టి.తాతారావు పర్యవేక్షణలో రెండు బృందాలుగా దాడులు నిర్వహించారు.వాడపల్లి, బంగారమ్మపేట గ్రామాల్లో సుమారు రూ.38లక్షల విలువైన పంచదార కలిపిన నాసిరకం బెల్లం స్వాధీనం చేసుకున్నామన్నారు. వాడపల్లిలో రామాంజనేయ బెల్లం బట్టీ వద్ద బండి శ్రీనివాసరావుకు చెందిన 36,500 కేజీల పంచదార, 2324 కేజీల నాసిరకం బెల్లం స్వాధీనం చేసుకున్నామని సీఐ టి.నాగ వెంకటరాజు తెలిపారు. బంగారమ్మపేటలో ఆనందరావు అనే వ్యక్తి చెందిన బెల్లం బట్టీలో 2,800 కేజీల పంచాదార486 కిలోల నాసిరకం బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. సీఐ మధుబాబు ఈ బృందానికి సారధ్యం వహించారన్నారు. పుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ రుక్కయ్య, లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ ఈ దాడుల్లో పాల్గొన్నారని తెలిపారు.