
బూరుగుపూడిలో చోరీ
రూ.45,000 నగదు, 2 కాసుల బంగారం, 200 గ్రాముల వెండి ఆభరణాలు తస్కరణ
మధురపూడి: తాళాలు వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి నగదు, నగలు చోరీ చేసిన ఘటన కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండా నాగ భూషణం కుటుంబ సమేతంగా బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లారు. తిరిగి శుక్రవారం ఉదయం ఇంటికొచ్చారు. ఇంట్లో సామాన్లు చిందర వందరగా పడి ఉండటం, తలుపుల తాళాలు పగిలి ఉండటం, గదిలో బద్దలయిన బీరువాను, దాని సొరుగులు మంచంపై పడి ఉన్నట్టు గుర్తించారు. దానిలోని రూ.45,000 నగదు, 2 కాసుల బంగారం, 200 గ్రాముల వెండి ఆభరణాలు, హాలులోని పెద్ద ఎల్‌ఈడీ టీవీ చోరీ అయినట్టు గుర్తించారు. దీంతో కోరుకొండ పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఎస్సై శ్యామ్‌సుందర్ ఆధ్వర్యంలో పరిశీలించారు. క్లూస్ టీమ్ చోరీ జరిగిన ప్రదేఽశంలో వేలిముద్రలను సేకరించింది. ఎస్సై శ్యామ్‌సుందర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.