ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఈడీ డైరక్టర్ సలోమ యండో
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పెట్రోలియం రంగంలో ఉపాధి అవకాశాలు విస్త్రృతంగా ఉన్నాయని ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఈడీ సలోమ యండో పేర్కొన్నారు. జేఎన్‌టీయూకే ప్రాంగణంలో శుక్రవారం ఉదయం అలూమ్ని ఆడిటోరియంలో ఫిపి స్టూడెంట్ చాప్టర్స్ 13వ వార్షిక సమావేశం నిర్వహించారు. యూసీఈకే కెమికల్ ఇంజినీరింగ్, పెట్రోలియం ఇంజినీరింగ్ విభాగాలలోని జేఎన్‌టీయూకే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పెట్రోలియం ఇండస్ట్రీ (ఫిపి) స్టూడెంట్ ఛాప్టర్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. జేఎన్‌టీయూకే ఫిపి స్టూడెంట్ చాప్టర్ ఫ్యాకల్టీ అడ్వయిజర్ ప్రొఫెసర్ కేవీ రావు అధ్యక్షత వహించగా ఉపకులపతి ప్రొఫెసర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్, ఫిపి డైరెక్టర్ (అన్వేషణ ుూఉత్పత్తి) దేబ్ జ్యోతి వెలిగించారు. ముఖ్యఅతిథి శ్రీ సలోమ యాండో మాట్లాడుతూ సహజ వనరుల రంగంలో భారత ప్రభుత్వం నిర్దేశించిన నికర జీరో లక్ష్యాలను సాధించడానికి సంబంధిత సంస్థలు తీసుకుంటున్న వివిధ కార్యక్రమాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. భారతదేశం చమురు వినియోగంలో 3వ స్థానంలో ఉందని, ప్రపంచవ్యాప్తంగా 13.2 బిఓఈ (బ్యారెల్ ఆఫ్ ఈక్వివాలెంట్) వినియోగిస్తుండగా మన దేశంలో 4.7 బిఓఈ వినియోగిస్తున్నామన్నారు. భారతదేశంలో 26 అవక్షేపణా బేసిన్‌లు ఉండగా మొత్తం 3.36 మిలియన్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో వ్యాపించి ఉన్నాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలో చమురు నిక్షేపాల అన్వేషణ, అభివృద్ధిపై రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నామన్నారు. దేశంలోని విద్యాసంస్థలతో కలిసి సంయుక్తంగా ఎనర్జీ ఇనీషియేటివ్ ప్రోగ్రామ్స్‌ను చేపట్టనున్నామన్నారు.
నూతన ఆవిష్కరణలు అవసరం
ఉపకులపతి ప్రొఫెసర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ మాట్లాడుతూ కెమికల్, పెట్రోలియం ఇంజినీరింగ్ విద్యార్థులు ఇంధన వనరుల ఉత్పత్తి రంగంలోకి రానున్న నేపథ్యంలో రాష్ట్ర, దేశ అవసరాల మేరకు ఇంధన వనరులను ఉత్పిత్తి చేసేలా నూతన ఆవిష్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కాలుష్య రహితమైన ఇంధన వనరులను అందించాల్సిన బాధ్యత పీఈసీఈ విద్యార్థులపై ఉందన్నారు. ఫిపి డైరెక్టర్ దేబ్ అధికారి మాట్లాడుతూ విద్యార్థులను ఇంధన రంగంలో భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దడమే ఫిపి ప్రధాన లక్ష్యమన్నారు. సహజ వనరుల రంగంలో డ్రిల్లింగ్ మరియు అన్వేషణలో ఖచ్చితత్వం అనేది చాలా ముఖ్యమని, దీన్ని దష్టిలో పెట్టుకుని ఫిపి స్టూడెంట్ చాప్టర్‌ల ద్వారా ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామన్నారు. దేశంలోని 11 విద్యాసంస్థల నుంచి వచ్చిన ఫిపి స్టూడెంట్ చాప్టర్‌ల ప్రతినిధులకు అతిథులు ఫిపి ఫ్లాగ్, బ్యాడ్జ్‌ను అందజేసి అభినందించారు. ఫిపి 13వ వార్షిక సమావేశంలో భాగంగా శ్రీభారతదేశంలో అధిక శక్తి సామర్థ్యం, కచ్చితత్వంతో హైడ్రోకార్బన్‌ల అన్వేషణను వేగవంతం చేయడంశ్రీ అనే నినాదంపై స్టూడెంట్ చాప్టర్లకు నిర్వహించిన పోటీలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నీరజ్ సిన్హా, ఓఎనన్‌జీసీ ఈస్ట్రన్ ఆఫ్‌షోర్ అసెట్ ఈడీ అసెట్ మేనేజర్ రత్నేష్ కుమార్, ఓఎన్‌జీసీ కావేరీ బేసిన్ మేనేజర్ ుూఈడీ శంతను ముఖర్జీలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. తదుపరి పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన స్టూడెంట్ చాప్టర్లకు అతిథులు బహమతులను ప్రదానం చేయడంతో పాటు విద్యార్థులకు సర్టిఫికెట్‌లను అందజేశారు. జేఎన్‌టీయూకే డైరెక్టర్‌లు ప్రొఫెసర్ బి.బాలకృష్ణ, ఏ.స్వర్ణకుమారి, యూసీఈకే ప్రిన్సిపాల్ ఎన్.మోహనన్‌రావు, అక్నూ మాజీ ఉపకులపతి కె.పద్మరాజు, కెమికల్, పెట్రోలియం ఇంజినీరింగ్ విభాగాధిపతులు, అధ్యాపకులు, దేశంలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన ఫిపి స్టూడెంట్ చాప్టర్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.