
ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా విజయ
అమలాపురం రూరల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అమలాపురం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎల్.విజయ రెడ్డి ఎన్నికయ్యారు.
ఈ నెల 4వ తేదీన కాకినాడ వీపీసీ మీటింగ్ హాల్లో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ ఎన్నికలు డాక్టర్ కీర్తి రామకృష్ణ అధ్యక్షతన జరిగాయి. అధ్యక్షుడిగా డాక్టర్ సీహెచ్ బాలచంద్ర యోగేశ్వర్, జనరల్ సెక్రటరీగా డాక్టర్ ఎల్.విజయ రెడ్డి ఎన్నికయ్యారు. విజయ రెడ్డిని జిల్లా పశువైద్య అధికారి కె.వెంకట్రావు, ఉప సంచాలకులు కర్నీడీ మూర్తి, వైద్యులు కలసి శుభాకాంక్షలు తెలిపారు.
పేపరుమిల్లు ఉద్యోగి
అదృశ్యం
రాజమహేంద్రవరం రూరల్: స్థానిక హుకుంపేటలోని అత్తారింటి నుంచి తన సొంతిల్లు ఉన్న కాతేరులోని కంఠమణివారి వీధికి వెళ్లిన పెనుమాక సునీల్‌కుమార్ కనిపించడం లేదని అతని భార్య పెనుమాక మాణిక్యం శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం
స్థానిక పేపర్ మిల్లులో ఉద్యోగం చేస్తున్న పెనుమాక సునీల్‌కుమార్ ఈ నెల 3వ తేదీ సాయంత్రం 5.30 గంటల సమయంలో హుకుంపేటలోని జనచైతన్య లే అవుట్‌లోని అత్తగారింటి నుంచి ఏపీ 39 ఎంపీ 3018 నెంబరు రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదని బొమ్మూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాణిక్యం పేర్కొంది. ఈ మేరకు బొమ్మూరు ఎస్సై సీహెచ్‌వీ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సునీల్‌కుమార్ ఆచూకీ తెలిసినా, మోటారు బైక్ ఆచూ కీ తెలిసినా బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ 94407 96533, 94911 22811 ఫోన్ నెంబరులో తనకు తెలియజేయాలని ఎస్సై రమేష్ కోరారు.
05 ఎఎంపీ 252:
డాక్టర్ విజయ రెడ్డిని అభినందిస్తున్న వైద్యులు ఉద్యోగులు