
రామాలయానికి వెండి కిరీటాలు
మండపేట: పట్టణంలోని 14వ వార్డు శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభమైన రామాలయానికి మున్సిపల్ చైర్‌పర్సన్ పతివాడ దుర్గారాణి వెండి కిరీటాలు సమర్పించారు. ఆలయంలో వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాలకు సుమారు రూ.లక్ష విలువైన వెండి కిరీటాలు సమర్పించారు. శ్రీరామ నవమి నాడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె దేవతామూర్తులకు కిరీటాలను అలంకరించారు. అనంతరం రాముల వారి కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. సీతారాముల అనుగ్రహంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ పెంకే గంగాధరం, నాయకులు తాడి రామారావు, శెట్టి నాగేశ్వరరావు, సూరంపూడి సత్యప్రసాద్, పిఠాపురం సత్యనారాయణ, శెట్టిబలిజ సంఘం నాయకులు, మహిళలు, కమిటీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.