
వేమగిరిలో తిరుమల క్యాంపస్‌కు భూమి పూజ
కడియం: వేమగిరి జాతీయ రహదారి పక్కనే తిరుమల విద్యాసంస్థల కొత్త ప్రాంగణానికి సోమవారం భూమి పూజ చేసినట్టు సంస్థ చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. వేమగిరి చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ డే స్కాలర్ క్యాంపస్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. ఇక్కడ ఎల్‌కేజీ నుంచి ఇంటర్ వరకు క్లాస్‌లు నిర్వహిస్తామని, 2026–27 నుంచి అడ్మిషన్లు జరుగుతాయన్నారు. ముందుగా తిరుమలరావు, సరోజినీదేవి దంపతులు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సంస్థ అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.