
రూ.10 లక్షల విలువైన రేషన్ బియ్యం పట్టివేత
రాజానగరం: జాతీయ రహదారిపై జీఎస్‌ఎల్ వైద్య కళాశాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షలు విలువ చేసే రేషన్ బియ్యాన్ని సోమవా రం పట్టుకున్నామని స్థానిక డిప్యూటీ తహసీల్దారు (పౌరసరఫరా లు) గొలుగూరి బాపి రాజు తెలిపారు. మూడు వాహనాలలో తరలిస్తున్న ఈ బియ్యాన్ని వాహనాలతో సహా స్వాధీన పర్చుకుని, కేసులు నమోదు చేసేందుకు రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గొల్లప్రోలుకు చెందిన ఆకుల స్వామి, పె ద్దాపురం మండలం గోరంట్లకు చెందిన కోన బాలరాజు, కోరుకొండ అచ్చిరాజు తమ వాహనాలలో ఈ బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. వారిపై కూడా కేసు లు నమోదు చేయడంతోపాటు ఈ అక్రమ దందాకు ప్రధాన కారకులు ఎవరనే విషయమై ఆరా తీస్తున్నామని చెప్పారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.10 లక్షలు కాగా, వాహనాల విలువ రూ.20 లక్షలు పైబడి ఉంటుందన్నారు.