
అట్టనాణేలతో లెక్కల పాఠాలు
అమలాపురం టౌన్: బ్రిటీషు కాలంలో దాదాపు 110 ఏళ్లనాటి ఎనిమిది రకాల అట్ట నాణేలను అమ లాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. కాలగర్భంలో కలిసి మరుగున పడిపోయిన ఈ నాణేలు అప్పట్లో అర్ధ రూపాయి, పావలా, బేడా (రెండు అణాలు), అణా, అర్ధణా, కాణి, దమ్మిడి అనే ఎనిమిది రకలుగా చెలామణిలో ఉండేవి. అప్పట్లో ఈ నాణేలను పిల్లలకు లెక్కలు నేర్పడానికి ఉపయోగించేవారని సేకరణ కర్త కృష్ణ కామేశ్వర్ తెలిపారు. అసలైన నాణేలు పిల్లలకు ఇస్తే అవిపోతే అనివార్యమయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టకుని వీటిని అట్టతో త యారు చేయించారు. వెండి రంగు, రాగి రంగుతో ఉండే ఈ అట్టనాణేలకు, అసలైన నాణేలకు వ్యత్యాసాన్ని ఎంతో పరీక్షించి చూస్తే తప్ప తెలియదు. ఈ నాణేలను బ్రిటీషు వారు జర్మనీ దేశానికి చెందిన లాంగ్ మన్స్ అనే కంపెనీ ద్వారా తయారు చేయించి మన దేశానికి రప్పించి ఇక్కడ విద్యార్థులకు లెక్కలు నేర్పేవారు. అయితే ఈ పద్ధతి ఎక్కువ కాలం నడవకపోవడంతో ఈ అట్టనాణేలు క్రమేణా అదృశ్యమయ్యాయి. అల్లవరం మండలం కోడూరుపాడు గ్రామానికి చెందిన నడింపల్లి రామరాజు 50 ఏళ్ల కిందట అనేక పాఠశాలలను సందర్శించి తిరిగి అట్టనాణేలను సేకరించారు. ఆయన నుంచి తాను సేకరించినట్లు కృష్ణ కామేశ్వర్ తెలిపారు.
110 ఏళ్ల క్రితం చలామణి
సేకరించిన కృష్ణ కామేశ్వర్