
ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
సీతానగరం: ఇటుక బట్టీలో మట్టిని తొక్కుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మండలంలోని రఘుదేవపురానికి చెందిన సిద్ద వెంకటేశ్వరరావు(45) మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు, ఎప్పటిలాగే గురువారం ఉదయం వెంకటేశ్వరరావు స్థానిక రవీంద్ర కాలనీలోని తన ఇటుక బట్టీ వద్దకు వెళ్లాడు. ఇటుకల తయారీ కోసం మట్టిని ట్రాక్టర్‌తో తొక్కుతుండగా, అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ క్రమంలో వెంకటేశ్వరరావు అదే మట్టిలో కూరుకుపోయాడు. బట్టీ వద్ద ఉన్నవారు పొక్లెయిన్ సాయంతో ట్రాక్టర్‌ను తొలగించి, వెంకటేశ్వరరావును బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానిక బస్టాండ్ సెంటర్ వద్దనున్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతితో భార్య దుర్గాభవాని, తల్లి సత్యవతి, వివాహాలైన కుమార్తెలు కోటేశ్వరి, సంధ్యారాణి భోరున విలపించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్టు హెడ్ కానిస్టేబుల్ శ్రీను తెలిపారు.

ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి