
జీడి పప్పు పరిశ్రమలకు హై ఓల్టేజీ
మలికిపురం/సఖినేటిపల్లి: హైఓల్టేజీ కారణంగా సఖినేటిపల్లి మండలం మోరిపోడులో బుధవారం రాత్రి పలు జీడిపప్పు పరిశ్రమలకు నష్టం వాటిల్లింది. దీని ప్రభావంతో విలువైన జీడిపప్పు మాడిపోయింది. అలాగే విలువైన విద్యుత్ పరికరాలు, జీడిపప్పు డ్రయ్యర్ మెషీన్లు దెబ్బతిన్నాయి. గ్రామంలోని ముప్పర్తి సుబ్బారావు పరిశ్రమతో పాటు, మరికొన్ని పరిశ్రమల్లో భారీ నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. జీడి పప్పు ప్రాసెసింగ్ కోసం డ్రయ్యర్ మెషీన్లలో ఉంచగా, తెల్లవారుజామున అటుగా జీడి పప్పు డ్రమ్ముల వద్దకు వెళ్లిన కార్మికులు హైఓల్టేజీని గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే కార్మికులు మెయిన్ స్విచాఫ్ చేసి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. లేకపోతే మరింత నష్టం వాటిల్లేదని సుబ్బారావు తెలిపారు. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని వ్యాపార వర్గాలు తెలిపాయి. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గురువారం దెబ్బతిన్న పరిశ్రమలను పరిశీలించారు. హైఓల్టేజీకి కారణాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
మాడిపోయిన సరకు
కాలిపోయిన పరికరాలు

జీడి పప్పు పరిశ్రమలకు హై ఓల్టేజీ