
తాళం పగులగొట్టి ఇంట్లో చోరీ
నిడదవోలు: తాళం పగులగొట్టి పట్టపగలే ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన సంఘటన పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు, స్థానిక దానమ్మగుడి వెనుక వీధిలోని రెండంతస్తుల భవనం కింది పోర్షన్‌లో పెట్రోల్ బంక్ ఉద్యోగి బలిజ సత్యనారాయణ నివసిస్తున్నారు. ఈయన కుమార్తె ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఉదయం పిల్లలతో సహా అందరూ వెళ్లిపోయారు. ఇంటికి తాళం వేసి సత్యనారాయణ కూడా బయటకు వెళ్లారు. మధ్యాహ్నం 2.30 సమయంలో ఆయన ఇంటికి తిరిగొచ్చారు. దొంగలు ఇంటికి వేసిన తాళాన్ని కట్టర్‌తో కట్ చేసి, ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా లాకర్‌ను కూడా కట్ చేసి, 35 కాసుల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదు, కొంత వెండిని అపహరించారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై జగన్‌మోహన్‌రావు తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
25 కాసుల బంగారం, నగదు అపహరణ