
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
సీతానగరం: మండలంలోని వంగలపూడిలో ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. వంగలపూడిలో కాలువ పూడిక తీతకు శుక్రవారం 130 మంది కూలీలు వెళ్లారు. వారిలో ఐదుగురు కూలీలు కాలువపై ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. ఇంతలో తేనె తుట్టైపె ఉన్న ఈగలు ఒక్కసారిగా వచ్చి వారిలో ముగ్గురిపై దాడి చేశాయి. సమాచారం అందుకున్న ఏపీఓ బీవి సత్యవతి సంఘటన స్థలానికి వెళ్లి తేనెటీగల దాడికి గురైన కోడెల్లి గంగరాజు, ఆరుగుల వెంకటేశ్వర్లు, ఓరిగంటి పాపలను సీతానగరం పీహెచ్‌సీకి తరలించి వైద్యసేవలు అందించారు. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.