
స్తంభాన్ని ఢీకొట్టిన కారు
మామిడికుదురు: మొగలికుదురు గ్రామ పంచాయతీ సమీపంలోని కడలి రోడ్డులో శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది. కాకినాడ నుంచి వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న పంట కాలువ పావంచాను ఢీ కొట్టి దాని పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. దానికి ఉన్న సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ దూరంగా పడింది. ఈ సమయంలో సమీపంలో ఎవరూ లేక పోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కాకినాడ నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.