
రాష్ట్రస్థాయి హాకీ విజేత కాకినాడ
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈనెల 6 నుంచి 9 వరకు జరిగిన రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల జూనియర్స్ హాకీ పోటీలలో కాకినాడ జిల్లా బాలుర జట్టు విజేతగా నిలిచిందని జిల్లా హాకీ సంఘ కార్యదర్శి నంబు శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. జిల్లాల విభజన తరువాత సాధించిన ఈ విజయం జిల్లాకు గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం కాకినాడ డీఎస్‌ఏలో జరిగిన కార్యక్రమంలో డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్ కుమార్, పీడీలు రవిరాజు, నూకరాజు, సూరిబాబు, సునీల్, పరశురాం, డిఎస్‌ఏ హాకీ కోచ్ నాగేంద్రలు విజేతలను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని క్రీడాకారులకు సూచించారు.