
మట్టి టిప్పర్ కనిపిస్తే సీజ్
కై కలూరు: కై కలూరు నియోజకవర్గంలో టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టి రవాణాపై ‘సాక్షి’లో ప్రచురించిన ‘కూటమి మట్టి మాఫియా’ కథనానికి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్పందించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులు, విలేకరులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో బుసక మట్టితో టిప్పర్ తిరిగితే వెంటనే కేసులు నమోదు చేసి సీజ్ చేయాలని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు. బోర్డర్లలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయిస్తామన్నారు. తన కుమారుడు టిప్పర్ పంపినా చర్యలు తీసుకోవాలని అన్నారు. గృహ అవసరాలకు ట్రాక్టర్లతో మట్టి తరలించవచ్చని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, తహసీల్దార్లు పాల్గొన్నారు. అలాగే కొల్లేరు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎమ్మెల్యే కామినేని అన్నారు. కొల్లేరు అభయారణ్యంలో డీ ఫాం, జిరాయితీ భూములు 22 వేల ఎకరాలను మినహాయించి 55 వేల ఎకరాల్లో అభయారణ్యాన్ని నిర్ణయించాలని ప్రభు త్వాన్ని కోరుతున్నామన్నారు.

మట్టి టిప్పర్ కనిపిస్తే సీజ్