
కవిటం బాలలకు భరతనాట్యం అవార్డు
పోడూరు: ఉగాది మహోత్సవంలో భాగంగా రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో సోమవారం బాలలకు నిర్వహించిన భారతీయ నృత్యోత్సవం–2025లో కవిటం గ్రామానికి రేమెళ్ల మనోజ్ఞ, ఇళ్ల జాహ్నవి, సత్తి హరినాగశ్రీ, వీరవల్లి యశిస్విని భరతనాట్యంలో అద్భుత ప్రదర్శన చేసి ఆహుతులను మెప్పించారు. నృత్యప్రదర్శన చేసిన కవిటం బాలికలకు నిర్వాహకులు నర్తన వసంత కుసుమం అవార్డు ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా నృత్యప్రదర్శన చేసిన మనోజ్ఞ, జాహ్నవి, హరి నాగశ్రీ, యశస్విని, పెనుగొండకు చెందిన శ్రీ వెంకటేశ్వర నృత్య నాట్య కళాశాలకు చెందిన నాట్యాచార్యులు కె.వినయ్‌కృష్ణను కవిటం గ్రామ ప్రముఖులు అభినందించారు.