
జామాయిల్ తోటలో అగ్నిప్రమాదం
ద్వారకాతిరుమల మండలంలోని రాళ్లకుంటలో ఇటీవల నరికివేసిన జామాయిల్ తోటలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 8లో u
విజయవంతంగా ఈఎండీపీ ఎక్స్‌పో
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్, సమగ్ర శిక్షా సంయుక్త అధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమం ఈఎండీపీ 2024–25 జిల్లాలోని 40 పాఠశాలల్లో అమలు చేశారు. ఇందుకు సంబంధించిన సెషన్ పూర్తయిన అనంతరం విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్‌లు ఆన్‌న్‌లైన్ ద్వారా స్వీకరించి వాటి నుంచి ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. జిల్లా స్థాయి ఎక్స్‌పోని స్థానిక ఈదర సుబ్బమ్మ దేవి మునిసిపల్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసారు. రెండు ప్రాజెక్టులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందచేశారు. సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కే.పంకజ్ కుమార్, జిల్లా విద్యా పర్యవేక్షణ అధికారి రెడ్డి రామారావు, జిల్లా సైన్స్ ఆఫీసర్ సోమయాజులు ప్రాజెక్టులను పరిశీలించారు. రాచూరు జెడ్పీ పాఠశాల విద్యార్థులు రూపొందించిన సౌర విద్యుత్ వినియోగం ప్రయోజనం, బొర్రంపాలెం విద్యార్థులు రూపొందించిన సాంకేతిక పరిష్కారాలు– రోబో పాత్ర ప్రాజెక్టులు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.
తణుకులో ఐటీ దాడులు
తణుకు అర్బన్: ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం తణుకులో ఇద్దరు వ్యాపారులపై దాడులు చేశారు. తణుకు పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కాటూరి లక్ష్మణరావుతోపాటు తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ఎన్.దుర్గాప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై నిర్వహించిన దాడుల్లో ఇద్దరి నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.