నెల నెలా కోత | - | Sakshi
Sakshi News home page

నెల నెలా కోత

Apr 3 2025 2:26 AM | Updated on Apr 3 2025 2:37 AM

నెల న

నెల నెలా కోత

ముమ్మరంగా మాసూళ్లు
దాళ్వా మాసూళ్లలో రైతులు నిమగ్నమయ్యారు. వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని ఆశిస్తున్నారు. 8లో u

గురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

సాక్షి, భీమవరం: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర సామాజిక పింఛన్ల లబ్ధిదారుల వెతలకు చెక్‌ పెట్టారు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు రాజకీయాలు, కులమత వర్గాలు చూడకుండా లబ్ధిదారులను ఎంపిక చేసేవారు. ఏటా జనవరి, జూలై నెలల్లో కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. ఇంటికే వచ్చి పింఛన్‌ అందించే ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో చెప్పినట్టుగానే రూ. 2000 పింఛన్‌ను ఏటా పెంచుతూ రూ.3000 చేశారు. 2019 నాటికి జిల్లాలో సుమారు 1.45 లక్షలు ఉన్న పింఛన్లు వైఎస్సార్‌సీపీ హయాంలో 2.36 లక్షలకు చేరుకోవడం గమనార్హం.

ప్రతి నెలా కోతే

పింఛన్‌ సాయాన్ని రూ.4000 చేశామంటున్న కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు మాత్రం మంజూరు చేయడం లేదు. పెంచిన భారం ఖజానాపై పడకుండా ఉన్నవాటికి కోత పెడుతోంది. 2024, జూన్‌లో 2,32,885 మందికి రూ.99.8 కోట్ల పింఛన్‌ సాయం అందిస్తే, ఈ ఏడాది ఏప్రిల్‌లో లబ్ధిదారుల సంఖ్య 2,25,718 మందికి తగ్గిపోయారు. వారికి అందించే సాయం రూ.96.8 కోట్లకు చేరింది. పది నెలల కాలంలో 7,167 పింఛన్లకు కూటమి కోత పెట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై దాదాపు రూ.25 కోట్లు భారాన్ని తగ్గించుకున్నట్టు అంచనా.

స్పౌజ్‌ పింఛన్లలో వింత పోకడ

పింఛన్‌ లబ్ధిదారుడు మృతిచెందితే మరుసటి నెల నుంచే అతని భార్య(స్పౌజ్‌)కు పింఛన్‌ మంజూరయ్యేలా యాప్‌లో ఆప్షన్‌ ఉంటుంది. కూటమి పాలన చేపట్టిన వెంటనే పింఛన్‌ సైట్‌ను క్లోజ్‌ చేయడంతో స్పౌజ్‌ పింఛన్ల మంజూరు ఆగిపోయాయి. నవంబరులో స్పౌజ్‌ ఆప్షన్‌ ఇచ్చినా కేవలం ఆ నెల నుంచి మృతిచెందిన వారి భార్యలకు మాత్రమే సాయం అందేలా కొర్రి పెట్టింది. దీంతో అంతకుముందు చనిపోయిన వారి కుటుంబాలకు పింఛన్‌ సాయం అందకుండా పోయింది. అధికారుల అంచనాల మేరకు జిల్లాలో 6000 మంది వరకు పింఛన్‌ లబ్ధిదారులు మృతిచెందగా కేవలం 607 మందికి మాత్రమే ప్రభుత్వం స్పౌజ్‌ పింఛన్‌ అందిస్తోంది.

న్యూస్‌రీల్‌

గత పది నెలల్లో జిల్లాలోని పింఛన్ల పంపిణీ వివరాలు

నెల పింఛన్లు సాయం

(రూ.

కోట్లలో)

జూన్‌ 2,32,885 99.80

జూలై 2,31,874 99.20

ఆగస్టు 2,31,075 99.18

సెప్టెంబరు 2,30,123 96.57

అక్టోబరు 2,29,184 96.19

నవంబరు 2,28,362 96.25

డిసెంబరు 2,27,755 96.49

జనవరి 2,27,086 96.72

ఫిబ్రవరి 2,26,044 96.61

మార్చి 2,25,718 96.87

50 ఏళ్లకే పింఛన్‌ హమీ గాలికి

తమ ప్రభుత్వం వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్‌ ఇస్తామని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఎన్నికల సభల్లో ఊదరగొట్టారు. పాలనలోకి వచ్చి పది నెలలు గడిచినా వాటి ఊసెత్తడం లేదు. జిల్లాలో 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సుమారు రెండున్నర లక్షల మంది వరకు ఉండగా వారిలో 70 శాతం మంది అర్హులు ఉంటారని అంచనా. ప్రభుత్వం 50 ఏళ్లకే పింఛన్‌ హామీ గురించి మాట్లాడకపోవడం ఆయా వర్గాల వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

వేలల్లో దరఖాస్తులు

చివరిగా 2024 జనవరిలో గత ప్రభుత్వం 4,274 కొత్త పింఛన్లు మంజూరు చేసింది. జూలైలో కొత్తవి మంజూరు రావాల్సి ఉండగా జూన్‌లో కూటమి రాకతో వాటికి బ్రేక్‌ పడింది. గత ఏడాది జనవరి నుంచి జూన్‌ నాటికి కొత్త పింఛన్ల కోసం 6,350 దరఖాస్తులు ఆన్‌లైన్‌ అయ్యాయి. కూటమి ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పింఛన్ల కోసం అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 25 వేలకు పైగా పింఛన్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు అంచనా. సైట్‌ ఓపెన్‌కాక దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసే వీలులేక ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పేదలు అందజేస్తున్న ఆర్జీలు ఏమవుతున్నాయో తెలీని పరిస్థితి.

పది నెలల్లో 7,167 పింఛన్ల తగ్గింపు

జూన్‌లో 2,32,885 మందికి రూ.99.7 కోట్ల పంపిణీ

ఈ ఏడాది ఏప్రిల్‌లో 2,25,718 మందికి రూ.96.87 కోట్ల సాయం

కొత్త పింఛన్‌ ఒక్కటీ మంజూరు చేయని వైనం

పెండింగ్‌లో 20 వేలకు పైగా దరఖాస్తులు

‘భీమవరంలోని పేద వృద్ధ దంపతులు చిన్నారావు, సత్యవతిల ఇద్దరు కుమారులు పనుల కోసం వేరే ఊళ్లు వలస వెళ్లిపోయారు. వృద్ధాప్య పింఛనే దంపతుల జీవనాధారం. గత ఆగస్టులో చిన్నారావు మృతిచెందగా స్పౌజ్‌ కోటాలో తర్వాతి నెల నుంచి సత్యవతికి పింఛన్‌ అందాలి. కూటమి ప్రభుత్వం ఆ ఆప్షన్‌ క్లోజ్‌ చేయడంతో ఆమెకు పింఛన్‌ సాయం అందక తీవ్ర ఇబ్బంది పడుతోంది. ఆమె ఒక్కరే కాదు జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన వేల మంది పింఛన్‌ కోసం అధికారులకు అర్జీలు అందజేసి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

నెల నెలా కోత 1
1/1

నెల నెలా కోత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement