
ట్రిపుల్ ఐటీలో పవర్ విజన్‌పై శిక్షణ
నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలోని ట్రిపుల్‌ఈ ఇంజినీరింగ్ విద్యార్థులకు శుక్రవారం పవర్ విజన్ 2050, ఎనర్జీ ఇంజినీరింగ్‌పై కెపాసిటీ బిల్డింగ్‌పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా విజయవాడ సమీపంలోని ఉన్న పవర్‌గ్రిడ్ జనరల్ మేనేజర్ కే నాగమోహన్‌రావు భారతదేశంలోని విద్యుత్ రంగం–భవిష్యత్ అనే అంశంపై ప్రసంగించారు. 2050 నాటికి దేశంలోని విద్యుత్ శక్తి రంగం స్థిరమైన, సమర్ధవంతమైన, వినియోగదారులకు అనుకూలమైన రంగంగా మారుతుందన్నారు. స్మార్ట్ గ్రిడ్ సాంకేతికతల గురించి వివరించారు. ట్రిపుల్‌ఈ హెచ్‌ఓడీ శ్రావణి కనక కుమారి, కోఆర్డినేటర్ జ్యోతీలాల్ నాయక్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.