
2 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
ఏలూరు(మెట్రో): జిల్లాలో దాళ్వా ధాన్యం సేకరణ లక్ష్యం 2 లక్షల టన్నుల అని జేసీ పి.ధాత్రి రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, గోనె సంచులను అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలోని 22 మండలాల్లో 241 రైతు సేవా కేంద్రాలు ఉండగా క్లస్టరింగ్ అనంతరం 118 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. ఏ గ్రేడ్ రకం క్వింటాలుకు రూ.2,320, కామన్ రకం క్వింటాల్‌కు రూ.2,300 మద్దతు ధరలు అందిస్తామన్నారు. ధాన్యం కొనుగోలుపై సందేహాలు, ఫిర్యాదుల కోసం జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ నంబర్లు 08812–230448, 77020 03584, 7569562076, 75695 97910లో సంప్రదించవచ్చని సూచించారు.
పిల్లలతో ఆత్మహత్యాయత్నం..
రక్షించిన పోలీసులు
ఏలూరు టౌన్: ఏలూరు టూటౌన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త వేధింపులు తాళలేక పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించగా.. అప్రమత్తమైన పోలీసులు వారిని రక్షించారు. వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని వాసావారి వీధికి చెందిన ఆలమూరి చంద్రశేఖర్, దివ్య భార్యాభర్తలు. వారికి 6వ తరగతి చదివే కుమారుడు, 4వ తరగతి చదివే కుమార్తె ఉన్నారు. చంద్రశేఖర్ సెల్‌ఫోన్ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో రోజూ గొ డవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దివ్య జీ వితంపై విరక్తి చెంది శనివారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ఏలూరు రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. దీనిని గమనించిన స్థానికులు డయల్ 112కు సమాచారం ఇవ్వగా ఏలూరు టూటౌన్ పోలీసులు వెంటనే స్పందించి ఆమె వద్దకు వెళ్లి వారిని రక్షించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. ఇదే తరహాలో ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడటం ఇది మూడోసారి కావడం గమనార్హం. గత రెండు సార్లూ పోలీసులు సకాలంలో వెళ్లి వారిని రక్షించి తీసుకువచ్చారు.
కూటమి నేతలపై
అట్రాసిటీ కేసు
కైకలూరు: పాత్రికేయుడిపై దాడి చేసిన కూ టమి నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు శని వారం రాత్రి నమోదయ్యింది. కైకలూరు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 27న కై కలూరు వైస్ ఎంపీపీ ఎన్నికల నిమిత్తం భుజబలపట్నం ఎంపీటీసీ ఓటు వేయాల్సి ఉంది. ఆయన్ను ఇంటిలో నిర్బంధించారనే సమాచారంతో న్యూస్ రైట్ పత్రిక ఎడిటర్ కురేళ్ల కిషోర్ గ్రామానికి వచ్చారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ కారులోకి వెళ్లడం, ఆయన భా ర్య రోదించడం వంటి సంఘటనలను ఆయన సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో కూటమి పార్టీకి చెందిన కటికిన జయప్రకాష్(జేపీ), కొల్లి వరప్రసాద్ (బాబీ), పాలపర్తి శ్యా మ్ గణేష్(బాబీ కారు డ్రైవర్), వదర్లపాడుకు చెందిన వడుపు ప్రసాద్, మరో కొందరు తన ను కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాతావరణ మార్పులతో గుబులు
భీమవరం: ఆరుగాలం కష్టించి పండించిన దాళ్వా పంట చేతికి వచ్చే సమయంలో వాతావరణంలో మార్పులు రైతులను ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడం, జిల్లాలో ఈదురుగాలులు, చిరుజల్లులు పడటంతో దిగాలు చెందుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 2.15 లక్షల ఎకరాల్లో దాళ్వా వరి సాగుచేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పీ ఆర్–126, ఎస్‌ఎల్–10 వంటి రకాలు మా సూళ్లు చేస్తుండగా ధాన్యం దిగుబడి ఆశాజనకంగా ఉంది. వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా వరి మాసూళ్లు ముమ్మరం కానున్నాయి. దాళ్వా సీజన్ ప్రారంభంలో రైతులు సాగునీటి ఎద్దడి, పైరుపై చీడపీడలు, ఎలుకల బెడదతో ఇబ్బందులు పడ్డారు. ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఒడిదుడుకుల ను ఎదుర్కొంటూ దాళ్వా పంట పండించారు. ప్రస్తుతం దాదాపు అన్ని మండలాల్లో గింజలు ఎర్రముక్కులు పడే దశలో ఉండగా ముందుగా నాట్లు వేసిన రైతులు మాసూళ్లకు సన్నద్ధమవుతున్నారు. ముందుగా మాసూళ్లు చేసిన రైతు లు కొట్టు, పొట్టు ధాన్యం ఎకరాకు 60 బస్తాలకు పైగా దిగుబడి వస్తున్నట్టు చెబుతుండటంతో మిగిలిన రైతులు దాళ్వా పంటపై ఆశలు పెట్టుకున్నారు.