
Facial Brush Benefits: ముఖం కాంతిమంతంగా కనిపించాలంటే.. ఎప్పటికప్పుడు ముఖాన్ని మంచినీటితో శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలనేది నిపుణుల మాట. అందుకు.. ఇలాంటి బ్రష్ (అయాన్ ఫేషియల్ బ్రష్)ని వినియోగిస్తే.. మంచి ఫలితముంటుంది.
ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. నిమిషానికి 9వేల వైబ్రెషన్స్(భ్రమణాల)తో.. 42 డిగ్రీల సెల్సియస్ వెచ్చదనంతో చర్మ రంధ్రాల్లోంచి మృత కణాలను, దుమ్ము, ధూళిని సమూలంగా తొలగిస్తుంది.
ఈ డివైజ్.. వాటర్ ప్రూఫ్ కావడంతో వాష్ రూమ్‌లోనే దీన్ని సులభంగా, సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. అవసరమైతే ఎల్లప్పుడూ అదే రూమ్‌లో భద్రపరచుకోవచ్చు కూడా. ముందుగానే చార్జింగ్ పెట్టుకునే వీలుంటుంది కాబట్టి.. వైర్‌లెస్‌గా పనిచేస్తుంది. అడాప్టర్ లేదా కంప్యూటర్ సాయంతో కూడా దీనికి చార్జింగ్ పెట్టుకోవచ్చు.
దాంతో ప్రయాణాల్లో కూడా దీన్ని ఈజీగా వెంట తీసుకెళ్లొచ్చు. ఈ బ్రష్.. సబ్బు లేదా క్రీమ్‌తో చక్కగా చర్మాన్ని క్లీన్ చేస్తుంది. ఇదే కంపెనీకి చెందిన క్రీమ్..ఈ డివైజ్‌తో పాటు లభిస్తుంది. అభిరుచిని బట్టి ఆ తర్వాత కూడా ఈ క్రీమ్‌ని ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే సాధారణ క్రీమ్స్ లేదా సబ్బులనూ వినియోగించుకోవచ్చు.
దీని ధర సుమారుగా 194 డాలర్లు. అంటే రూ. పదిహేనువేలకు పైనే. అయితే ఇలాంటి మోడల్ బ్రష్‌లు ఆన్‌లైన్‌లో చాలానే ఉన్నాయి. తక్కువ ధరలో కూడా అందుబాటులో ఉన్నాయి. కొనుగోలు చేసేముందు వినియోగదారుల రివ్యూస్‌ని ఫాలో అవ్వడమనేది తప్పనిసరి.
చదవండి: Unwanted Hair: పై పెదవి మీద, చుబుకం కింద డార్క్ హెయిర్.. పీసీఓఎస్ వల్లేనా? పరిష్కారం?
Sara Ali Khan: పండ్లే కాదు.. వాటి తొక్కలు కూడా వదలను! నా బ్యూటీ సీక్రెట్ ఇదే
Comments
Please login to add a commentAdd a comment