మన దగ్గర క్యాబేజీని తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఇతర ప్రపంచ దేశాల్లో ప్రతి సలాడ్‌లోనూ క్యాబేజీ తప్పక ఉండాల్సిందే. ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలే ఇందుకు కారణం. క్యాబేజీలో విటమిన్ ‘సి’ అధికం. పీచు పదార్థాలు కూడా అధికం.
వీటితో పాటు బీటా కెరోటిన్, విటమిన్ కే, అయోడిన్, పొటాషియం, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. క్యాలరీలు మాత్రం తక్కువ. అయితే క్యాబేజీలో కేవలం ఆరోగ్య లాభాలు మాత్రమే కాదు.. చర్మ సౌందర్యాన్ని పెంపొందించే గుణాలు కూడా ఉన్నాయి. దీనిని పలు బ్యూటీ ట్రీట్మెంట్స్ లో మాత్రం విరివిగా ఉపయోగిస్తారు.
అందమైన ముఖం కోసం..
►తాజాగా ఉన్న క్యాబేజీ ఆకులను శుభ్రంగా కడిగి పేస్టులా రుబ్బుకోవాలి.
►మరిగించిన గ్రీన్ టీ నీళ్లను ఈ పేస్టులో కలిపి చల్లారిన తర్వాత ముఖానికి అప్లై చేయాలి.
►ఆరిన తరువాత చల్లటి నీటితో కడగాలి.
►జిడ్డుచర్మం ఉన్న వారు గోరువెచ్చని నీటితో కడగాలి.
►ముఖంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి, నిగారింపునిస్తుంది.
చదవండి: Groundnuts Health Benefits: ఉడకబెట్టిన పల్లీలు తినడం ఇష్టమా? ఇవి విడుదల చేసే సెరోటోనిన్ వల్ల..
Beauty Tips- Beetroot: ముఖం మీది మొటిమలు, మృత కణాలు ఇట్టే మాయం
Comments
Please login to add a commentAdd a comment