సాధారణంగా వాతావరణ పరిస్థితులను బట్టి, సైజును బట్టి ఒక టమాట మొక‍్కకి పెద్దవైతే 10-30, కాస్త చిన్నవైతే సుమారుగా 20 నుంచి 90 వరకు టమాటాలు కాస్తాయి. అయితే లండన్‌లో ఒక టమాటా మొక్కకి ఏకంగా 839 టమాటాలు కాసి గిన్నీస్ రికార్డులో స్థానం దక్కించుకుంది.
లండన్‌కి చెందిన ఐటీ మేనేజర్ డగ్లస్ స్మిత్ మార్చి నెలలో తన గార్డెన్‌లో చెర్రీ టమాటా (చిన్న టమాటా) విత్తనాలు నాటాడు. వారానికి 2-3 గంటల పాటు వాటి పోషణ, సంరక్షణలకు కేటాయించేవాడట. మొక్క ఎదిగి, టమాటాలు కాశాక లెక్కిస్తే దిమ్మతిరిగిపోయే రేంజిలో 839 టమాటా తేలాయి. ఇంకేముంది మనోడు గిన్నీస్ బుక్ అధికారులకు సమాచారం అందించాడు. 2010లో ఒక టమాటా మొక్కకు 448 టమాటాలు కాయించిన గ్రహం టాంటెర్ పేర ఉన్న రికార్డును డగ్లస్ స్మిత్ బద్దలుకోట్టి ప్రపంచ రికార్డును దక్కించుకున్నాడు. గతంలో కూడా 3.1 కేజీల అతిపెద్ద టమాటాను కాయించి గిన్నీస్‌లో చోటు దక్కించుకున్న డగ్లస్ తాజా పరిణామంతో మరోసారి వార్తల్లో కెక్కాడు.
చదవండి: Old viral video: పడిపోయాననుకున్నావా? ఈత కొట్టాలనిపించింది.. దూకేశా..
Comments
Please login to add a commentAdd a comment