అర కప్పు ధనియాలు, పదిహేను కరివేప ఆకులు, అరకప్పు గులాబీ రేకులను రెండు గ్లాసుల నీటిలో వేసి బాగా మరిగించాలి. నీళ్లు రంగు మారాక స్టవ్ ఆపేసి వడగట్టాలి. వడగట్టిన నీటిని తాగాలి. వారానికి మూడు గ్లాసులు ఈ నీటిని తాగాలి. దీనిలో ఉండే విటమిన్ ఎ, కొల్లాజన్‌లు హార్మోన్ల అసమతుల్యం వల్ల వచ్చే మొటిమలను తగ్గిస్తాయి.
గ్రీన్ టీ
ఇతర అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, ఈ అధునాతన పానీయం ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్‌తో సహా యాంటీఆక్సిడెంట్‌లతో నిండి ఉంది. మొటిమల రూపానికి ముందు ఏర్పడే సెబమ్ ఆక్సీకరణను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
పసుపు టీ
పసుపులో ఉండే కర్కుమిన్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ లక్షణాలకు విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. వేడినీటిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని తాగండి ఈజీగా మొటిమలు మాయం అవుతాయ. వీటి తోపాటు పులియబెట్టిన మజ్జిగ వంటివి తీసుకోవడం వల్ల ఈ కూడా ఈ సమస్య నుంచి ఇంకా సులభంగా బయటపడొచ్చు.
చివరిగా వంటింటి చిట్కా!
అలాగే జీడిపప్పును పాలలో నానబెట్టి, తరువాత నెయ్యిలో ఎర్రగా వేయించాలి. ఇవి చల్లారాక పేస్టు చేయాలి. ఈ పేస్టుని కూరలో వేసి పదినిమిషాలు మగ్గనిస్తే గ్రేవీ చిక్కగా వస్తుంది.
(చదవండి: బౌల్ మసాజ్‌తో మెరిసిపోండి! ఆరోగ్యం, అందం మీ సొంతం!)
Comments
Please login to add a commentAdd a comment