జాగింగ్ చేసేవారు తప్పనిసరిగా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే జాగింగ్ చేయడంలో బాగా క్యాలరీలు ఖర్చవుతాయన్న విషయం తెలిసిందే. నిజానికి అవి కొవ్వులను కాల్చేస్తే మేలు. కానీ ఒకవేళ దానికి బదులుగా మన దేహంలోని ప్రోటీన్లను కాల్చేస్తే?... దాంతో మనకు తీరని నష్టం జరుగుతుంది. అందుకే జాగింగ్ చేయడానికి ఓ అరగంట ముందు చాలా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు) ఉండటం మంచిది. ఇందులోసం ఒక చిలగడదుంప (మోరంగడ్డ), బంగాళదుంప, కార్న్‌ఫ్యాక్స్‌లలో ఏదో ఒకటి తీసుకుని, దాంతో పాటు ఒక గ్లాసు పాలు (లో ఫ్యాట్ మిల్క్) తాగడం మంచిది.
ఒక కప్పు పండ్ల ముక్కలూ తీసుకోవచ్చుగానీ... అందులో అరటి, పుచ్చకాయ, సపోటా, డ్రైఫ్రూట్స్ లేదా ఖర్జూరం తీసుకోవడం అంత మంచిది కాదు. జాగింగ్ చేయడానికి ముందే నీళ్లు (ప్లెయిన్ వాటర్) నింపిపెట్టుకున్న ఓ బాటిల్ లేదా ఓఆర్‌ఎస్ సొల్యూషన్ వెంట ఉంచుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది... జాగింగ్ చేసిన వెంటనే నీళ్లు/ఓఆర్‌ఎస్ ద్రావణం తాగకూడదు. జాగింగ్ ముగిశాక... కాస్తంత వ్యవధి తర్వాతే తాగాలి.
Comments
Please login to add a commentAdd a comment