'హాడ్జికిన్స్ లింఫోమా' ను అర్థం చేసుకుని.. సరైన చికిత్సనందించటం ఎలా? | Hodgkin Lymphoma Is A Group Of Blood Cancer | Sakshi
Sakshi News home page

'హాడ్జికిన్స్ లింఫోమా' ను అర్థం చేసుకుని.. సరైన చికిత్సనందించటం ఎలా?

Published Mon, Oct 30 2023 12:59 PM | Last Updated on Tue, Oct 31 2023 3:52 PM

Hodgkin Lymphoma Is A Group Of Blood Cancer - Sakshi

సాక్షి : బ్లడ్ క్యాన్సర్‌కు సంబంధించి ఒక నిర్దిష్టమైన ఉపరకం, హాడ్జికిన్స్  లింఫోమా. ఇది రోగనిరోధక వ్యవస్థ యొక్క లింఫాటిక్ డివిజన్ ( శోషరస విభాగం) ని ప్రభావితం చేస్తుంది మరియు తెల్ల రక్తకణాల అసాధారణ పెరుగుదలకు దారితీస్తుంది. ఈ కారణం చేత శరీరంలోని వివిధ ప్రాంతాలలో శోషరస కణుపులు (లింప్ నోడ్స్) పెద్దవిగా మారడం మరియు కణితులు ఏర్పడటం జరగవచ్చు. ఇది అరుదైన మరియు తీవ్రమైన పరిస్థితి అయినప్పటికీ, సత్వర గుర్తింపు మరియు చికిత్సతో విజయవంతంగా కోలుకోవడం సాధ్యమవుతుంది.

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్ లో సీనియర్ కన్సల్టెంట్ హెమటో-ఆంకాలజిస్ట్ & బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ గా సేవలనందిస్తున్న డాక్టర్ అనిల్ అరిబండి ఈ జబ్బు గురించి మాట్లాడుతూ.. "2020 సంవత్సరంలో, భారతదేశంలో దాదాపు 11,230 కొత్త హాడ్జికిన్స్ లింఫోమా కేసులు నమోదయ్యాయి. ఈ జబ్బు మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా  20- 39 సంవత్సరాల మధ్య మరియు 65 ఏళ్లు పైబడిన వారిపై అధిక ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ, వంశపారంపర్యంగా ఈ సమస్య వున్నవారు మరింత ఎక్కువగా  ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి. HIV/AIDS మరియు ఎప్స్టీన్-బార్ వైరస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు దీని తీవ్రతను మరింతగా  వృద్ధి చేసే ప్రమాదం ఉంది" అని అన్నారు. 

వ్యాధి లక్షణాలు.. రోగ నిర్ధారణ..
హాడ్జికిన్స్  లింఫోమా యొక్క ప్రారంభ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉండవచ్చు. సాధారణంగా మెడ, చంకలు లేదా గజ్జలువంటి ప్రాంతాల్లో నొప్పి లేకుండా లింప్ నోడ్స్ పెద్దగా ఉన్నట్లు కనిపిస్తాయి. ఇతర లక్షణాలలో తరచుగా జ్వరం రావటం, దీర్ఘకాలిక అలసట, తీవ్రమైన దురద మరియు రాత్రి సమయంలో అధిక చెమటలు పట్టడం వంటివి కనిపిస్తాయి. ఈ సంకేతాలను సాధారణంగా ఇతర ఆరోగ్య సమస్యగా తప్పుగా భావించవచ్చు. కచ్చితమైన రోగ నిర్ధారణ మరియు సకాలంలో చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.

హాడ్జికిన్స్  లింఫోమా ను గుర్తించే విధానం గురించి అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్ లో సీనియర్ కన్సల్టెంట్ హెమటో-ఆంకాలజిస్ట్ &  బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ అనిల్ అరిబండి చెబుతూ "హాడ్జికిన్స్ లింఫోమాను గుర్తించడానికి, ప్రాథమిక దశలో శారీరక పరీక్ష చేసి, లింప్ నోడ్స్ వాపు జరిగిందా లేదా అన్నది నిర్ణయించడం చేస్తారు. హాడ్జికిన్స్  లింఫోమా యొక్క సంభావ్యతను గుర్తించడానికి CBC (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) చేసి హాడ్జికిన్స్ లింఫోమా  కనుగొనే ప్రయత్నం చేస్తారు. దీనిని మరింతగా  ధృవీకరించడానికి, వైద్యులు PET స్కాన్, CT స్కాన్ మరియు Tissue biopsy కూడా  సిఫారసు చేయవచ్చు. రోగనిర్ధారణ జరిగిన తర్వాత, వైద్యులు వ్యాధిని స్టేజ్ I నుండి IV వరకు విభజించి, తగిన చికిత్సను అందిస్తారు " అని అన్నారు.

చికిత్స అవకాశాలు:
కీమోథెరపీ:  క్యాన్సర్ కణాలను నాశనం చేసే ఒకే ఔషదాన్ని నేరుగాగానీ, పలు ఔషదాల మిశ్రమంను నోటి ద్వారాగానీ, నరాల ద్వారా శరీరంలోకి ఇస్తారు.
రేడియేషన్ థెరపీ:  క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకోవడానికి, అలగే నాశనం చేయడానికి అధిక-తీవ్రత కలిగిన కిరణాలు ఉపయోగించబడతాయి.
టార్గెటెడ్ థెరపీ: ఈ ప్రత్యేక చికిత్స నిర్దిష్ట క్యాన్సర్ కణాలపై దృష్టి పెడుతూ.. తొలగిస్తుంది.
► ఇమ్మ్యూనో  థెరపీ: ఈ పద్ధతి శరీరం యొక్క సహజమైన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, సాధారణంగా చెక్‌పాయింట్ ఇన్హిబిటర్ల వినియోగం ద్వారా ఇది చేస్తారు. 
బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్: రోగి, దాత నుండి మూలకణాలను ఉపయోగించి, ఈ ప్రక్రియలో ప్రభావితమైన ఎముక మజ్జ (బోన్ మారో)ను రక్తం, రోగనిరోధక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడానికి ఆరోగ్యకరమైన మూలకణాలతో భర్తీ చేస్తారు.

స్థిరమైన జీవనశైలి మార్పులు..
హాడ్జికిన్స్ లింఫోమా ఉన్న రోగులు గుర్తించవలసినది ఏమిటంటే, తమ రోజువారీ అలవాట్లలో మార్పులు చేసుకోవటం చికిత్స ఫలితాల పరంగా ప్రధానంగా మార్పు తీసుకువస్తుందని. ఆహార ప్రాధాన్యతలు, వ్యాధి మధ్య ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ, ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది.

హాడ్జికిన్స్ లింఫోమా చికిత్స చేయగలదని పరిగణనలోకి తీసుకుంటే, ముందుగా గుర్తించడం.. సత్వర చికిత్స  వైద్య ఫలితాలను, రోగుల జీవన నాణ్యతను బాగా మెరుగుపరుస్తుందని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్ లో సీనియర్ కన్సల్టెంట్ హెమటో-ఆంకాలజిస్ట్ & బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్  డాక్టర్ అనిల్ అరిబండి వెల్లడించారు.


డాక్టర్ అనిల్ అరిబండి, సీనియర్ కన్సల్టెంట్
హెమటో - ఆంకాలజిస్ట్ & బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్, అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement