కావలసినవి: గోధుమ పిండి – రెండు కప్పులు, ఇన్‌స్టంట్ ఈస్ట్ – రెండు టీస్పూన్లు, పంచదార – టీస్పూను, వేడినీళ్లు – కప్పు, పనీర్ – పావుకేజీ, పచ్చిమిర్చి – పదిహేను, ఉడికించిన మొక్కజన్న గింజలు – యాభై గ్రాములు, ఉడికించిన బఠాణీ – యాభై గ్రాములు, వాల్‌నట్స్ – వందగ్రాములు, వెల్లుల్లి రెబ్బలు – ఆరు, పసుపు – టీస్పూను, కొత్తిమీర – చిన్నకట్ట, పుదీనా – పది ఆకులు, ధనియాల పొడి – టీస్పూను, చాట్ మసాలా – టీస్పూను, ఆమ్‌చూర్ పొడి – టీస్పూను, కారం – టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ..
►ఒక పెద్దగిన్నెలో గోధుమ పిండి, ఈస్ట్, అరటీస్పూను సాల్ట్, పంచదార వేసి కలపాలి.
►దీనిలో వేడినీళ్లు పోసి ముద్దలా కలుపుకుని పదిహేను నిమిషాలపాటు చక్కగా కలుపుకోవాలి. తరువాత ఐదు గంటలపాటు పక్కనపెట్టుకోవాలి.
►బఠాణి, మొక్కజొన్న గింజలు, పచ్చిమిర్చి, వాల్‌నట్స్, కొత్తిమీర ధనియాలపొడి, వెల్లుల్లి రెబ్బలు, చాట్ మసాలా, ఆమ్‌చూర్ పొడి, కారం, పుదీనాఆకులు మిక్సీజార్‌లో వేసి చక్కగా గ్రైండ్ చేయాలి
►ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకోని పనీర్, రుచికి సరిపడా ఉప్పు వేసి చక్కగా కలుపుకోవాలి.
►ఐదు గంటలు నానిన పిండి ముద్ద రెట్టింపు అవుతుంది.
► ఈ పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి చిన్న పూరీలా వత్తుకోవాలి∙
►ఈ పూరీలో రెండు టేబుల్ స్పూన్ల మసాలా మిశ్రమం వేసి కజ్జికాయల అంచులు మూసినట్లుగా మూసేయాలి.
►పిండి మొత్తాన్ని ఇలా మసాలా మిశ్రమం బయటకు రాకుండా వత్తుకోవాలి.
►ఇప్పుడు వీటన్నింటి ఆవిరి మీద ఉడకిస్తే సిద్ధూ రెడీ. నెయ్యి లేదా ఏదైనా చట్నీతో ఈ సిద్ధూలు చాలా బావుంటాయి.
చదవండి: Som Tam Salad In Telugu: వరల్డ్ ఫుడ్ థాయ్ సొమ్‌తమ్ తయారీ ఇలా!
Himachal Siddu Recipe In Telugu: హిమాచల్ వంటకం.. సిద్దూలు తయారీ ఇలా!
Published Sat, Jun 18 2022 4:28 PM | Last Updated on Sat, Jun 18 2022 4:45 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment