ఇండియాస్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ క్రిమటోరియం | Memories of Pa | Sakshi

ఇండియాస్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ క్రిమటోరియం

Aug 11 2024 9:46 AM | Updated on Aug 11 2024 9:46 AM

Memories of Pa

అత్యాధునిక వసతులతో పా మెమరీస్‌ 
సాధుజీవుల అంత్యక్రియల కోసం..  
గోపన్‌పల్లిలో ప్రారంభానికి సిద్ధం

  పెట్స్‌ చనిపోయినప్పడు యజమానుల బాధ అంతా ఇంతా కాదు. కుటుంబంలో ఒకరిని కోల్పోయినట్లు ఉంటుంది.. వారిని ఓదార్చలన్నా ఎవరి తరం కాదు. అలాంటి వారు తమ పెట్స్‌ చనిపోయినప్పడు ఓ అందమైన ప్రదేశంలో వాటికి అంత్యక్రియలు నిర్వహించామనే అనుభూతిని కోరుకుంటారు. డాగ్, క్యాట్, రాబిట్, పక్షులు వంటి (చిన్న సైజు) జీవుల అంత్యక్రియల కోసం పా(పీఏడబ్ల్యూ) మెమరీస్‌ పేరిట గోపన్‌పల్లి అత్యాధునిక వసతులతో దహనవాటిక ఏర్పాటు చేశారు. రాగా ఫౌండేషన్‌ ఫౌండర్, ప్రెసిడెంట్‌గా ఎంఎస్‌ రామయ్య బెంగళూర్‌ విశ్వవిద్యాయంలో బయోటెక్నాలజీ పూర్తిచేసి, కొంపల్లిలో నివాసం ఉండే నందకిశోర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇండియాస్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ క్రిమటోరియాన్ని ప్రత్యేక శ్రద్ధతో పా మెమరీస్‌ పేరిట ఆయన నెలకొల్పారు. మరికొద్ది రోజుల్లోనే నగరవాసులకు అందుబాటులోకి రానుంది.  

ఇంట్లో పెంచుకునే జంతువుల అంత్యక్రియల కోసం దహన వాటికను ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని రాగా ఫౌండేషన్‌ జీహెచ్‌ఎంసీని కోరడంతో గోపన్‌పల్లి సర్వే నంబర్‌ 34లో 500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలోనే అత్యాధునిక వసతులతో పా మెమరీస్‌ క్రిమషన్‌ ఏర్పాటు చేశారు. సాధు జీవులను కాల్చేందుకు తమిళనాడు నుంచి మోక్ష కొవడం అనే అత్యాధునిక యంత్రాన్ని తీసుకొచ్చి అమర్చారు. ఇందులో ప్రైమరీ బర్నర్, సెకండరీ బర్నర్‌లు ఉంటాయి. ఒక్కో పెట్‌ అంత్యక్రియల కోసం 20 కిలోల నేచురల్‌ గ్యాస్‌ వినియోగిస్తారు. జీవి కాలినప్పడు బయటకు వచ్చే పొగను మెకానికల్, వాటర్‌ శుద్ధి చేసి బయటకు వదులుతారు. దీంతో పరిసరాల్లో ఎలాంటి దుర్వాసన ఉండదు. తుది వ్యర్థాలు నీటిలోకి వదిలి.. అనంతరం శ్మశానవాటికలోని మొక్కలకు వాడతారు. జంతువులు, పక్షుల నుంచి వచ్చే ఎముకలు, బూడిద(బోన్‌ మీల్‌)ను యజమానులకు ఇవ్వడం లేదంటే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఎవెన్యూ మొక్కలకు వాడేందుకు వీలుంటుంది. బోన్‌ మీల్‌తో మొక్కలు బలంగా ఉంటాయి. ఎలాంటి పొల్యూషన్‌ ఉండదు. పా మెమరీస్‌ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. 15 రకాల మొక్కలు నాటి ఆహ్లాదకరంగా ఉండేలా గ్రీనరీ ఏర్పాటు చేశారు.  

పా మెమరీస్‌లో వీవింగ్‌ గ్యాలరీ ఏర్పాటు చేశారు. అంత్యక్రియల కోసం వచ్చే వారు అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. అవసరమైతే వాటర్, కాఫీ, స్నాక్స్‌ అందజేసి సిబ్బంది ఓదారుస్తారు. తీరని బాధలో ఉన్న వారికి అవసరమైతే మానసిక వైద్య సేవలకు 
సిఫార్సు చేస్తారు.  

రెండు ఫ్రీజర్లు.. 
పా మెమరీస్‌కు చనిపోయిన జంతువులు, పక్షులు రాత్రి సమయంలో వచి్చనా.. యంత్రం పాడైనా.. అంత్యక్రియలకు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పుడు వాటిని భద్రపరి చేందుకు రెండు ఫ్రీజర్లతో మార్చురీ ఏర్పాటు చేశారు. కాటి కాపరి, డ్రైవర్ల కోసం ప్రత్యేక వసతి కలి్పంచారు. 24 గంటలు కాటి కాపరి, డ్రైవర్లు అందుబాటులో ఉంటారు.

ప్రత్యేక వాహనాలు 
పెట్స్‌ చనిపోయాయన్న సమాచారం అందిన వెంటనే ప్రత్యేక వాహనం వెళ్తుంది. ఆ వాహనంలో నాలుగు పెట్స్‌ను ఒకేసారి తీసుకొచ్చే విధంగా ఫ్రీజర్‌ను అమర్చారు. ఒక్కో పెట్‌కు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. వివరాల కోసం ఫోన్‌: 91003 68124, 
63026 95966.

మనుషుల శ్మశానవాటికలా ఉండాలి 
పా మెమరీస్‌ చూస్తే మనుషుల శ్మశానవాటిక కూడా ఇలా ఉండాలే అని అనుకునే విధంగా ఏర్పాటు చేశాం. ఇండియాస్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ క్రిమటోరియంగా పిలుచుకుంటున్నాం. రాయదుర్గంలోని మహా ప్రస్తానం చూసినప్పుడు అలాంటి శ్మశానవాటికను పెట్స్‌ కోసం ఏర్పాటు చేయాలని భావించాను. పా మెమరీస్‌ కోసం రూ.కోటి 90 లక్షలు ఖర్చు చేశాను. కొద్ది సంవత్సరాలుగా వైల్డ్‌ లైఫ్‌లో పని చేస్తున్నాను. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న బర్డ్స్‌ పార్క్‌ కన్సల్టెన్సీగా పని చేస్తున్నాను. 
– నంద కిశోర్‌రెడ్డి, రాగా ఫౌండేషన్‌ అధ్యక్షులు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement