Recipes In Telugu: How To Make Nadru Yakhni | Nadru Yakhni Recipe Preparation in Telugu - Sakshi
Sakshi News home page

Nadru Yakhni: చపాతీ, అన్నంలోకి తామర పువ్వు కాడతో రుచికరమైన వంటకం! ఇలా

Published Thu, Jun 2 2022 5:12 PM | Last Updated on Thu, Jun 2 2022 6:05 PM

Recipes In Telugu: How To Make Nadru Yakhni - Sakshi

 తామరపువ్వు కాడలతో ఘుమఘుమలాడే కశ్మీరీ వంటకం నద్రు యఖని. ఇలా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకుని సరికొత్త రుచులను ఆస్వాదించండి.

కావలసినవి:
►తామరపువ్వు కాడలు – నాలుగు
►పెరుగు – రెండు కప్పులు
►శనగపిండి – టేబుల్‌ స్పూను
►సోంపు పొడి – టీస్పూను
►దాల్చిన చెక్క – అంగుళం ముక్క
►బిర్యానీ ఆకులు – రెండు
►నల్ల యాలక్కాయలు – రెండు
►సాధారణ యాలక్కాయలు – రెండు
►జీలకర్ర – టీస్పూను
►లవంగాలు – రెండు
►ఇంగువ – పావు టీస్పూను
►గరం మసాలా – టీస్పూను
►నెయ్యి – నాలుగు టేబుల్‌ స్పూన్లు
►ఉప్పు – రుచికి సరిపడా
►కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు.

తయారీ..
►ముందుగా తామరపువ్వు కాడల తొక్కతీసి శుభ్రంగా కడగాలి.
►తరువాత సన్నని ముక్కలుగా తరగాలి.
►తరిగిన ముక్కల్లో కొద్దిగా నీళ్లుపోసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
►ఒక గిన్నెలో పెరుగు, శనగపిండి ముప్పావు కప్పు నీళ్లు పోసి చక్కగా కలపాలి.
►ఈ మిశ్రమాన్నీ పదినిమిషాలపాటు సన్నని మంట మీద ఉడికించాలి.
►పెరుగు మిశ్రమం ఉడికిన తరువాత ఉడికించిన తామర పువ్వు కాడలు, గరంమసాలా, సోంపుపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి  ఒకసారి కలిపి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి.
►స్టవ్‌ మీద మరో బాణలిపెట్టి నెయ్యి వేయాలి.
►నెయ్యి వేడెక్కిన తరువాత జీలకర్ర వేసి వేయించాలి.
►ఇది వేగాక దాల్చిన చెక్క, లవంగాలు, రెండు రకాల యాలుక్కాయలు, బిర్యానీ ఆకులు వేసి సువాసన వచ్చేంత వరకు వేయించాలి.
►మసాలా దినుసులన్నీ వేగాక ఇంగువ వేసి తిప్పాలి.
►ఈ పోపు మిశ్రమాన్ని ఉడికించి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేసి కలిపి, కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే ఎంతో రుచికరమైన నద్రు యఖని రెడీ.
చపాతీ, అన్నంలోకి ఇది చాలా బావుంటుంది.

చదవండి 👇
Mutton Rogan Josh Recipe In Telugu: అన్నం, రుమాలీ రోటీలోకి అదిరిపోయే మటన్‌ రోగన్‌ జోష్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement