
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇంటికి కరెంటు అక్కర్లేదు. అదేంటి ఇల్లన్నాక కరెంటు లేకుండా ఎలా అనుకుంటున్నారా? నిజంగానే, ఈ ఇంటికి కరెంటు అక్కర్లేదు. తనకు కావలసిన కరెంటును ఈ ఇల్లు తనంతట తానే తయారు చేసుకుంటుంది. నిజానికి కావలసినంత కాదు, అవసరానికి మించినంత కరెంటునే తయారు చేసుకుంటుంది. పైకప్పు మీద అమర్చిన సౌర ఫలకాల ద్వారా ఇదంతా సాధ్యమవుతుంది.
అమెరికన్ స్టార్టప్ కంపెనీ ‘కాస్మిక్ బిల్డింగ్స్’ కస్టమర్ల అవసరాల మేరకు ఇలాంటి ‘సెల్ప్ పవర్డ్’ ఇళ్లను రూపొందిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియాల్లో గృహనిర్మాణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ, 450 చదరపు అడుగుల కనీస విస్తీర్ణం మొదలుకొని, రకరకాల పరిమాణాల్లో పొందికైన ఇళ్లను నిర్మిస్తోంది. ఇలాంటి ఇళ్లు విరివిగా తయారయ్యేటట్లయితే, కరెంటు కొరత సమస్య ఉండనే ఉండదు.
చదవండి: అక్కడ కాస్త ఎండపొడ కనిపించినా చాలు.. పిల్లల్ని తీసుకెళ్లి బయట వదిలేస్తారు! ఎందుకంటే