నీతో యుద్ధం చెయ్యలేను | Sri Kalahastiswara Satakam In Telugu Article | Sakshi
Sakshi News home page

నీతో యుద్ధం చెయ్యలేను

Published Thu, Dec 24 2020 7:00 AM | Last Updated on Thu, Dec 24 2020 7:03 AM

Sri Kalahastiswara Satakam In Telugu Article - Sakshi

పద్యం 8 
నీతో యుద్ధము చేయనోప, గవితానిర్మాణశక్తి న్నినున్‌ ––              
బ్రీతుం చేయగలేను, నీకొరకు తండ్రిం చంపగా జాల  నా  ––        
చేతన్‌ రోకటి నిన్ను మొత్త వెఱతున్‌ చీకాకు నాభక్తియే  ––      
రీతి న్నాకిక నిన్ను జూడగ నగున్‌ శ్రీ కాళహస్తీశ్వరా !  
               

భావం
శ్రీ కాళహస్తీశ్వరా! నీతో యుద్ధం చెయ్యలేను.మంచి కవిత్వంతో నిన్ను మెప్పించలేను. నీ కోసం తండ్రిని   
చంపలేను.రోకలితో నిన్ను కొట్టడానికి  నాకు  భయం. నీపై నాకున్న భక్తి నన్ను చికాకు
పెడుతోంది. మరి ఎలా  నిన్ను దర్శించగలను ?   

పద్యం 9        
ఆలున్‌ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం ––         
బేలా నామెడ గట్టినాడవిక నిన్నే వేళ జింతింతు, ని   –––               
ర్మూలంబైన మనంబులోనెగడు దుర్మోహాబ్ధిలో  గ్రుంకి  యీ  ––        
శీలామాలపు జింతనెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా !  
       
             

భావం     
శ్రీ కాళహస్తీశ్వరా ! భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి, ధనము, అనే  ఈ  బంధాలను నా మెడకు ఎందుకు కట్టావు?  ఇక నిన్ను ఏ సమయంలో ధ్యానించేది ? నిన్ను స్మరించడం మాని, ఈ మోహసముద్రం లోమునిగిన  నా  భరించరాని దుఃఖాన్ని ఎలా తొలగిస్తావు?        

-తెలుగు తాత్పర్యం: టేకి వీరబ్రహ్మం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement