మిడిల్ క్లాస్ ఫ్యామిలీ
ఒకపుడు అద్దె కట్టడానికి కూడా కష్టం
మరిపుడు ఇంటర్నేషనల్ క్రష్‌గా
ఏడేళ్ల కరియర్‌లో సుమారు 15 హిట్స్
సినీ పరిశ్రమలో మహిళలు నిలదొక్కుకోవడం అంటే మాటలు కాదు. స్టార్ హీరో, మెగాహీరో, సూపర్ స్టార్, క్రేజీ స్టార్, గ్లోబల్ స్టార్, ప్యాన్ ఇండియా స్టార్ ఈ ట్యాగ్‌లు, బిరుదులు అన్నీ హీరోలకే. వీటిన్నింటిని తోసి రాజని తామేంటో నిరూపించుని నిలబడిన వారు చాలాకొద్దిమంది. అలాంటి వారిలో టాప్‌లో ఉంటుంది నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న నటి రష్మికమందన్నా. టాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని చోట్లా స్టార్ హీరోయిన్‌గా చలామణి అవుతోంది. ‘తగ్గేదేలే’ అంటూ దూసుకు పోతోంది. ఒక కుగ్రామంనుంచి వచ్చి ఇంత స్టార్‌డమ్ ఎలా తెచ్చుకుంది.. ఆ వివరాలు ఒకసారి చూద్దాం.
1996 ఏప్రిల్ 5న పుట్టింది రష్మిక. ఆంగ్ల సాహిత్యం, జర్నలిజం, మనస్తత్వశాస్త్రంలో డిగ్రీలు చేసింది. రష్మిక మధ్యతరగతి కుటుంబానికి చెందినది. తల్లిదండ్రులు ఆర్థికంగా కష్టపడటం చూసింది.అద్దె కట్టడానికి కూడా డబ్బు లేని పరిస్థితిని కూడా చూసింది.
కర్ణాటకలో పుట్టిపెరడంతో 2016లో కన్నడ మూవీతో "కిరిక్ పార్టీ" , తెరంగేట్రం చేసింది. తొలి సినిమాలనే సూపర్‌హిట్ అయింది. 20 ఏళ్లకే నటిగా మారిన రష్మిక అదృష్టం వరించింది. ఈ మూవీ బడ్జెట్ రూ.4 కోట్లు కాగా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల బిజినెస్ చేసింది. అందం, అభినయానికి , పట్టుదల, కృషిని జోడించింది. అలా టాలీవుడ్‌కి పరిశ్రమను ఆకర్షించింది.
2018 లో "ఛలో" తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కిల్లర్ లుక్స్‌తో ఇటు యూత్ ఐకాన్‌గా, అటు దర్శక నిర్మతాల బెస్ట్ ఆప్షన్‌గా మారింది. సమంతా సినిమా తిరస్కరించడంతో. రష్మిక మందన్నకు అదృష్టం వరించింది. ఇక ఆ తరువాత "డియర్ కామ్రేడ్", గీత గోవిందం" వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో రష్మిక అగ్ర నటిగా నిలదొక్కుకుంది. స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.
వరుస సినిమాలతో ఈమె మన తెలుగు అమ్మాయే అన్నట్టుగా మారిపోయింది. అగ్రహీరోల సరసన కూడా నటించింది. ఆ తరువాత అల్లు అర్జున్ సరసన నటించిన 'పుష్ప' సినిమా ఆమెకు ఎక్కడలేని స్టార్‌డమ్ తెచ్చి పెట్టింది. చిత్తూరు యాసతో శ్రీవల్లిగా అందరినీ అబ్బుర పరిచింది. శ్రీవల్లి కాస్తా 'నేషనల్ క్రష్' గా అవతరించింది. ఇక ‘సామి.. సామి’ సాంగ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.
పుష్ప రికార్డు వసూళ్లను రాబట్టింది. దీంతో బాలీవుడ్ కూడా రారమ్మని ఆహ్వనించింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి "మిషన్ మజ్ను"లో రష్మిక మందన్న బాలీవుడ్ అరంగేట్రం చేసింది. అటు తమిళంలో కార్తీతో కలిసి "సుల్తాన్" లో కోస్టార్‌గా నటించింది. తరువాత విజయ్ లాంటి పెద్ద స్టార్స్ పక్కన కూడా అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్ రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన సెన్సేషనల్ మూవీ 'యానిమల్' మూవీ రష్మిక మందన్న కెరీర్‌ని కొత్త మలుపు తిప్పింది. తమిళంలో విజయ్‌తో చేసిన 'వారిసు' మూవీ కూడా సూపర్‌హిట్ అయింది. దీంతో ఇంటర్ నేషనల్ క్రష్‌గా మారిపోయింది. అంతేనా ఇటీవల వరల్డ్ టాప్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా త '30 అండర్ 30' అనే కేటగిరీలో చోటు సంపాదించుకుంది. సినిమా పరిశ్రమనుంచి అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరిగా నిలిచింది.
అవార్డులు
"కిరిక్ పార్టీ"లో తన నటనకు ఉత్తమ తొలి నటిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు (SIIMA) గెలుచుకుంది.
“గీత గోవిందం” మూవీకి ఉత్తమ నటిగా జీ సినీ అవార్డ్స్ తెలుగు , తెలుగు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
వీటన్నింటికన్న మిన్నగా తన యాక్టింగ్ స్టయిల్, స్మైల్, ఆన్-స్క్రీన్ లుక్స్, మెస్మరైజింగ్ లుక్స్‌తో పాన్-ఇండియా స్టార్‌గా లక్షలాదిమంది అభిమానుల గుండెల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
వ్యక్తిగత జీవితంలో ఎదురుదెబ్బలు, డేటింగ్ రూమర్లు, పెళ్లికబుర్లు, ట్రోలింగ్‌లు, డీప్ ఫేక్ వీడియోలు ఇవేవీ రష్మిక కమిట్‌మెంట్‌ను దెబ్బతీయలేవు.. ఒక్క చిరునవ్వుతో అవన్నీ బలా దూర్ అంటారు ఫ్యాన్స్.
Comments
Please login to add a commentAdd a comment