భారతదేశంలోని చాలా మంది వర్కింగ్ మహిళలు అనుమానిస్తున్న విషయాన్ని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. మెంటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్ యువర్ దోస్త్ ‘ఉద్యోగుల భావోద్వేగ స్థితి’ పేరుతో ఒక తాజా నివేదికను విడుదల చేసింది. 5,000 కంటే ఎక్కువ మంది భారతీయులను సర్వే చేసింది. ఆఫీసుల్లో ఒత్తిడికి సంబంధించి మన దృష్టి కోణాన్ని మార్చే అంతర్‌దృష్టిని వెలికితీసింది. కార్యాలయాల్లో పనిచేసే దాదాపు మూడు వంతుల (72.2 శాతం) మంది మహిళలు అధిక ఒత్తిడి స్థాయిలను నివేదించారు.
దీనికి విరుద్ధంగా, పురుషులను ‘ఒత్తిడి’కి సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు వారిలో 53.64 శాతం మంది అధిక ఒత్తిడి స్థాయిలను అనుభవిస్తున్నారని చె΄్పారు. అధిక శాతం స్త్రీలు పని – జీవిత సమతుల్యత లో΄ాన్ని నివేదించారు. 12 శాతం మంది పురుషులతో పోలిస్తే 18 శాతం మంది మహిళలు వ్యక్తిగత, వృత్తిపరమైన సమతూకం కోసం కష్టపడుతున్నారని చె΄్పారు. మహిళల ప్రధాన ఒత్తిడికి కారణం తగినంత గుర్తింపు లేక΄ోవడం, ధైర్యంగా ఉండకపోవడం, భయం వంటి సమస్యలతో ఉన్నట్టు గమనించారు. ఆందోళనకరంగా 20 శాతం మంది మహిళలు ఎప్పుడూ నీరసంగా ఉన్నట్టు నివేదించగా, 9.27 శాతం మంది పురుషులు మాత్రమే అదే భావాన్ని పంచుకున్నారు.
వయసు–ఒత్తిడి
ఉద్యోగుల ‘ఎమోషనల్ వెల్‌నెస్ స్టేట్’ నివేదిక ప్రకారం మిగతా వారితో పోల్చితే 21– 30 మధ్య వయసు గల ఉద్యోగులు, కార్మికులు అత్యంత ఒత్తిడికి గురవుతున్నారు. 21– 30 సంవత్సరాల మధ్య వయసు గల 64.42 శాతం మంది ఉద్యోగులు, కార్మికులు తీవ్రస్థాయి ఒత్తిడిని అనుభవిస్తున్నట్టు నివేదించారు. 31 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గల 59.81 శాతం మంది కార్మికులు కూడా ఇదే విధమైన సమస్యను నివేదించారు.
తక్కువ ఒత్తిడికి గురైన వయసు సమూహం 41 నుండి 50 సంవత్సరాలు. ఈ వయసు గ్రూపులో 53.5 శాతం మంది ఉద్యోగులు మాత్రమే కార్యాలయంలో అధిక స్థాయి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు నివేదించారు. వర్క్‌ప్లేస్ డైనమిక్స్‌లో మార్పు, రిమోట్, హైబ్రిడ్ వర్క్ మోడల్స్ పరిమాణం, 21 – 30 ఏళ్ల జనాభాపై ప్రభావం చూపింది. వారికి మద్దతుగా, సంస్థలు రెగ్యులర్ కమ్యూనికేషన్, ఎంగేజ్‌మెంట్ ప్రాధాన్యత ఇవ్వాలి’ అని చీఫ్ సైకాలజీ ఆఫీసర్ డాక్టర్ జిని గోపీనాథ్ అన్నారు.
ఐటీ అండ్ మాన్యుఫాక్చరింగ్, రవాణా, సిబ్బంది నియామకాలు, టెక్ అండ్ మీడియా, లీగల్ సర్వీస్, బిజినెస్ కన్సల్టింగ్, సేవల రంగాలలోని ఉద్యోగులను సర్వే చేసిన తర్వాత ఈ ఫలితాలు వెల్లడి చేశారు.
తగినంత గుర్తింపు లేకపోవడం, ధైర్యంగా ఉండకపోవడం, భయం వంటి సమస్యలతో మహిళలు ప్రధానంగా ఒత్తిడికి గురవుతున్నట్టు్ట మెంటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్ ‘యువర్ దోస్త్’ తాజా నివేదికలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment