వీగన్స్‌: కనీసం జంతువుల పాలు కూడా తాగరు..మరి ప్రోటీన్స్‌ ఎలాగంటే.. | World Vegan Day 2023 Significance And Side Effects Of Diet - Sakshi
Sakshi News home page

World Vegan Day 2023:వీగన్స్‌గా మారుతున్నారా?కఠిన నిబంధనలు పాటించాలి? ఈ విషయాలు తెలుసా?

Published Wed, Nov 1 2023 11:20 AM | Last Updated on Wed, Nov 1 2023 1:12 PM

World Vegan Day Significance And Side Effects Of Diet - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా చాలామంది వీగన్స్‌గా మారిపోతున్నారు. ఈమధ్య వీగన్‌ డైట్‌ను పాటించే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. సోషల్‌ మీడియాలో ప్రచారం పెరగడం, ఈ కొత్త రకం డైట్ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడం, సెలబ్రిటీలు కూడా వీగన్స్‌గా మారిపోతుండటంతో చాలామంది ఈ డైట్‌ను ఫాలో అవుతున్నారు.

వీగన్లు పాల ఉత్పత్తులు, తేనె, తోలు, ముత్యాల వంటి వాటికి దూరంగా ఉంటారు. మొక్కల నుంచి లభించే పదార్థాలను మాత్రమే తీసుకుంటారు. ఏటా నవంబర్‌ 1న వరల్డ్‌ వీగన్‌ డే గా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈ సందర్భంగా వీగన్‌ డైట్‌ వల్ల అన్నీ ప్రయోజనాలేనా? ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా అన్నది ఈ స్టోరీలో చూద్దాం. 


జంతువులకు హానీ చేయకుండా, శాకాహారాన్ని ప్రోత్సహిస్తూ ఈ మధ్య అందరూ వీగన్స్‌గా మారుతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ డైట్‌ను ఫాలో అవుతున్నారు.1944 నవంబర్ నెలలో ది వీగన్ సొసైటీని డొనాల్డ్ వాట్సన్ ఏర్పాటు చేశాడు. వీగన్, వీగనిజమ్ అనే పదాలు పుట్టింది కూడా అప్పుడే. వీగన్‌ డైట్‌ అంటే సింపుల్‌గా చెప్పాలంటే పూర్తిగా శాఖాహార పదార్థాలనే తీసుకోవడం. జంతు సంబంధిత ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, కేవలం వృక్ష సంబంధిత ఆహారాలను తీసుకోవడం ఈ డైట్‌ ముఖ్య ఉద్దేశం.

ఇక వీగనిజం పాటించే వాళ్లు ముఖ్యంగా  కఠినమైన  ఆహార పద్దతులను పాటిస్తారు. కేవలం మొక్కల ద్వారా లభించే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. పాలపదార్థాలు గానీ, జంతువుల నుంచి వచ్చే ఏ ఆహారాన్ని తీసుకోరు. కానీ వాటికి ప్రత్యామ్నాయంగా ఆహారంలో పోషక విలువలు తగ్గకుండా జాగ్రత్తలు వహిస్తారు. పాలకు బదులుగా పల్లీలనుంచి తీసిన పాలు, కొబ్బరి, జీడిపప్పుతో చేసిన ఛీజ్‌ కేక్‌ లాంటివి తిని పోషకాహార లోపాన్ని అధిగమిస్తారు.


వీగన్లు తాము వేసుకునే దుస్తుల్లోనూ జంతు సంబంధమైనవి లేకుండా కేవలం లెనిన్‌, కాటన్‌తో రూపొందిన దుస్తులకే ప్రాధాన్యత ఇస్తారు. చలిని తట్టుకోవడానికి మనం ధరించే కోట్లు, బెల్టులు, టోపీల తయారికి లక్షల కొద్ది మూగజీవుల్ని వధిస్తున్నారనే కారణంతోనే వీగన్లు.. ఈ దుస్తులను నిషేధిస్తున్నారు. జంతు చర్మంతో తయారవుతున్న ఉత్పత్తులకు బదులుగా కృత్రిమ నార, సోయా ఉత్పత్తులు, రీసైకిల్డ్‌ నైలాన్‌, కార్డ్‌ బోర్డులతో రూపొందిన దుస్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అమీర్‌ ఖాన్‌, కంగనా రనౌత్‌, సోనమ్‌ కపూర్, అనుష్క శర్మ, శ్రద్ధా కపూర్ వంటి సెలబ్రిటీలు సైతం కొన్నేళ్లుగా వీగన్స్‌గా మారి అలాంటి డైట్‌ను ఫాలో అవుతున్నారు. 

ఆ రిస్క్‌ తక్కువ
పూర్తి శాకాహారాన్ని అనుసరించడం వల్ల చక్కెర స్థాయిలను, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. ఎందుకంటే ఈ తరహా ఆహారాలు సంతృప్త కొవ్వులో తక్కువగా, ఫైబర్‌ను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఫ్యాట్‌ కంటెంట్‌ ఉండదు కాబట్టి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను బ్యాలెన్స్‌ చేస్తూ బరువు కూడా కంట్రోల్‌లో ఉంటుంది. 

వీగన్‌ డైట్‌తో నష్టాలివే

వీగన్‌ డైట్‌తో ఎన్నో లాభాలున్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వీగన్ ఫుడ్ తీసుకునేవారికి ఐరన్ సమస్యలు వచ్చే అవకాశముంది. చాలా మంది శాకాహారులు ఐరన్ లోపంతో రక్తహీనతకు గురవుతున్నారు. 
► వీగన్స్‌లో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్‌ B12 పోషకాల లోపం ఉండే అవకాశం ఉంది. 

చివరగా చెప్పేదేంటంటే.. వెజీటేరియన్స్‌ అయినా, వీగన్స్‌గా మారినా తమ శరీర తత్వాన్ని బట్టి డైట్‌ను ఫాలో అవ్వాలి. శృతి మించితే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement