అన్నమయ్య జయంతి ఉత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అన్నమయ్య జయంతి ఉత్సవాలు ప్రారంభం

Published Sun, May 7 2023 2:26 AM | Last Updated on Sun, May 7 2023 2:26 AM

- - Sakshi

విజయవాడ కల్చరల్‌: అన్నమయ్య జయంతి సందర్భంగా అన్నమయ్య సంకీర్తన అకాడమీ (శ్వాస), కంచికామకోటీ పీఠ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వారం రోజులపాటు నిర్వహించే అన్నమయ్య జయంతి మహోత్సవాలు శనివారం లబ్బీపేట శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. అన్నమయ్య కీర్తనలను గాయ నీగాయకులు గానం చేశారు. పోవూరి శ్యామ సుందర్‌, బుర్రా నీలకంఠశాస్త్రి, కస్తూరి గోపాలరావు, జీ అనూరాధ్‌, వైష్టవి, మంజుల, వేమూరి విశ్వనాథ్‌ పాల్గొన్నారు. అన్నమయ్య జయంతి సందర్భంగా సంగీత విద్వాంసులు శోభాయాత్ర చేశారు. పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణ మండపం నుంచి అన్నమయ్య విగ్రహంతో ప్రారంభించి లబ్బీపేట వెంకటేశ్వర స్వామి విగ్రహం వరకు సాగింది.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం శనివారం 522.00 అడుగుల వద్ద ఉంది. ఇది 152.9470 టీఎంసీలకు సమానంగా ఉంది. సాగర్‌ జలాశయం నుంచి ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి 27,193, ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్‌ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 28,095 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌ జలాశయానికి 28,095 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 807.70 అడుగుల వద్ద ఉంది. ఇది 32.9712 టీఎంసీలకు సమానం.

వీడని వర్షం

కొరిటెపాడు(గుంటూరు): జిల్లాను వర్షం వీడడం లేదు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కోతలు పూర్తికాని మొక్కజొన్న, జొన్న చేలు ఈదురు గాలులు, భారీ వర్షానికి నేలవాలుతున్నాయి. ప్రస్తుత రబీ సీజన్‌లో జిల్లాలో దుగ్గిరాల, తెనాలి, చేబ్రోలు, కొల్లిపర, కాకుమాను, ప్రత్తిపాడు, పొన్నూరు, వట్టిచెరుకూరు తదితర మండలాల్లో 25,984 హెక్టార్లలో మొక్కజొన్న, 9,078 హెక్టార్లలో జొన్న సాగు చేశారు. వీటిలో సుమారు 55 శాతం పంట కోతలు పూర్తయ్యాయి. పలుచోట్ల పంట నూర్పిళ్లు చేస్తుండగా అకాల వర్షాలతో కల్లాల్లోని మొక్కజొన్న, జొన్న తడిచిపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

ఎండ.. వాన దోబూచులాట...

వాతావరణంలో మార్పులు కారణంగా కొద్దిసేపు ఎండరావడంతో నూర్పిడి చేసిన మొక్కజొన్న, జొన్నలను రైతులు గట్టుకు చేర్చి ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటికే ఒక్కసారిగా వర్షం పడడంతో ఎండబెట్టిన మొక్కజొన్న, జొన్న పంటను తడవకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకచోట వర్షం పడుతుంటే మరొక చోట భారీ వర్షం కురుస్తోంది.

కొల్లిపరలో 37.6 మిలీమీటర్ల వర్షం..

గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా కొల్లిపర మండలంలో 37.6 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా దుగ్గిరాల మండలంలో 0.8 మి.మీ. వర్షం పడింది. సగటున 11.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. వట్టిచెరుకూరు 29.8, తాడికొండ 24.2, ఫిరంగిపురం 22.8, కాకుమాను 20.2, తుళ్లూరు 16.2, గుంటూరు తూర్పు 10, మేడికొండూరు 9.4, పెదకాకాని 8.2, గుంటూరు పశ్చిమ 7.8, తాడేపల్లి 7.6, పొన్నూరు 5.4, తెనాలి 3.8, చేబ్రోలు మండలంలో 2.2 మి.మీ చొప్పున వర్షం పడింది.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement