నగరంపాలెం: జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్ శనివారం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ అందరి జీవితాలలో నూతన కాంతులు, సంతోషాలను నింపాలని అన్నారు. భోగి భోగభాగ్యాలను, సంక్రాంతి సుఖసంతోషాలను, కనుమ కమ్మని కనువిందులను అందించాలని ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాల మేలవింపుతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో చేసుకోవాలని అన్నారు.
ఘనంగా ఎల్‌జీ
సంక్రాంతి సంబరాలు
పాత గుంటూరు: సంక్రాంతి సందర్భంగా ఎల్.జి. నిర్వహించిన లక్కీ డ్రాలో గుంటూరు సోనోవిజన్ కస్టమర్ కిరణ్‌కుమార్ రెడ్డి రూ.2,69,990 విలువ చేసే ఎల్.జి. 55 ఇంచ్ ఏఎల్‌ఈడీ టీవీని గెలుపొందారు. కార్యక్రమంలో సోనోవిజన్ అధినేత పొట్లూరి భాస్కర్ మూర్తి, విజయవాడ బ్రాంచ్ మేనేజర్ పరుచూరి కిషోర్‌బాబు, మార్కెటింగ్ మేనేజర్ హేమంత్ కుమార్ పాల్గొని విజేతకు బహుమతిని అందజేశారు.
మచిలీపట్నం వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ సుందరాచారి
గుంటూరు మెడికల్: మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారిని నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం డాక్టర్ సుందరాచారి గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్నారు. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా డాక్టర్ సుందరాచారికి పదోన్నతి ఇచ్చి మచిలీపట్నం వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీ చేశారు. గుంటూరు వైద్య కళాశాలలో 1981లో ఎంబీబీఎస్ చదివి, అనంతరం న్యూరాలజీలో పీజీ చేసి 2001లో జీజీహెచ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆయన విధుల్లో చేరారు.
అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా గుంటూరు జీజీహెచ్‌లో డాక్టర్ సుందరాచారి పదోన్నతులు పొంది పనిచేశారు. గత ఏడాది రాష్ట్ర ఉత్తమ టీచర్ అవార్డును అందుకున్నారు. న్యూరాలజీ విభాగాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ విభాగంగా తీర్చిదిద్దారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వార్డులో స్లీప్ ల్యాబ్, స్ట్రోక్ యూనిట్‌లు ఏర్పాటు చేయటం ద్వారా నాణ్యమైన వైద్య సేవలతో 2018లో ఐఎస్‌ఓ గుర్తింపు సైతం న్యూరాలజీ వార్డుకు లభించడంలో డాక్టర్ సుందరాచారి కృషి ఎనలేనిది. 2022లో ఫెలో ఆఫ్ ది అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీగా ఎన్నికై అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment