హార్బర్‌కు కూటమి గ్రహణం
రేపల్లె రూరల్: ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక తీర ప్రాంతం కలిగిన నిజాంపట్నం హర్బర్ అభివృద్ధిపై గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా హార్బర్ రెండో దశ నిర్మాణానికి రూ.451 కోట్లు కేటాయించింది. 2022లో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూ వచ్చాయి. 70 శాతం పనులు పూర్తయ్యాక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. పనులు పూర్తిగా ఆగిపోయాయి. ఇటీవల 10 రోజులుగా మొదలైనా అవీ నత్తనడకన సాగుతున్నాయి.
హార్బర్‌లో 1980లో 60 బోట్లు నిలిపేలా 250 మీటర్లతో జెట్టీ రూపొందించారు. బోట్ల సంఖ్య పెరగడంతో నిలిపేందుకు జెట్టీ సామర్థ్యం సరిపోలేదు. మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. సముద్రంలోకి బోట్ల రాకపోకలకు ఏర్పాటు చేసిన మొగ సామర్థ్యం కుచించుకుపోవటం, ప్రస్తుత నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన బోట్లు జెట్టీ వద్దకు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విపత్తుల సమయంలో దీనివల్ల నష్టం భారీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో గత వైస్సార్ సీపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. రూ.451 కోట్లతో రెండో దశ నిర్మాణ పనులు చేపట్టింది. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 500 మీటర్లతో జెట్టీ నిర్మాణం, ప్రస్తుత మొగ సామర్థ్యం పెంపు, ఇరువైపులా 1570 మీటర్ల బౌల్డర్స్ ఏర్పాటు వంటి ఆధునికీకరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం మొగకు ఇరువైపులా బౌల్డర్స్ పనులు పూర్తయ్యాయి. బోట్ల రాకపోకలకు ఆటంకం లేకుండా బ్రేక్‌వాటర్ సిస్టం నిర్వహిస్తున్నారు. ఆఫీసు బిల్డింగ్, రెస్ట్ రూమ్, ఐస్‌ప్లాంట్, ఓవర్ హెడ్ ట్యాంక్, సాలిడ్ వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, పార్కింగ్ ప్లేస్, ఆక్షన్ హాల్, బోటు బిల్డింగ్ యార్డ్, నెట్ రిపేర్ షెడ్, బీఎల్‌సీ పార్కింగ్, సోలార్ ప్యానల్స్ వంటివి అధునాతన సౌకర్యాలతో నిర్మించాల్సి ఉంది. ప్రగతి పనులు పూర్తయితే 9 వేలకుపైగా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వలసలకు అడ్డుకట్ట పడనుంది. ఇతర ప్రాంతాల బోట్లు నిజాంపట్నం హార్బర్ నుంచి ఎక్కువగా రాకపోకలు సాగించనున్నాయి. మత్స్యసంపద ఎగుమతులు, దిగుమతులు పెరిగే అవకాశం కలగనుంది.
నిజాంపట్నంలో నత్తనడకన అభివృద్ధి పనులు రెండో దశపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు పూర్తయితే వేల మందికి ఉపాధి అవకాశాలు వైఎస్సార్‌సీపీ హయాంలోనే 70 శాతం పనులు కూటమి వచ్చాక నామమాత్రంగా పనుల్లో కదలిక కీలకమైన హార్బర్‌పై పాలకులతీవ్ర నిర్లక్ష్యం
త్వరగా పూర్తి చేయాలి
ఏళ్లుగా వేటపై ఆధారపడ్డాం. జెట్టీ సామర్థ్యం చాలక బోట్లు నిలపడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. బోట్లు ప్రకృతి విపత్తుల సమయంలో ధ్వంసం అవుతున్నాయి. ప్రభుత్వం ప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.
–బి.వెంకటేశ్వరరావు, బోటు ఓనరు
మత్స్యకారుల చిరకాల వాంఛ
హార్బర్ అభివృద్ధి మత్స్యకారుల చిరకాల వాంఛ. పనులు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి లభించనుంది. నిజాంపట్నం ఉపాధి కేంద్రంగా మారుతుంది. కొంత కాలంగా పనులు నిలిచిపోయాయి. ఎక్కడా నాణ్యత లోపించకుండా అధికారులు పర్యవేక్షించాలి.
–కె.మాణిక్యారావు, మత్స్యకారుడు
త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు
ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయి. మొగ సామర్థ్యం పెంచాం. డ్రెజ్జింగ్, ఉత్తర, దక్షిణ వైపు బౌల్డర్స్, బ్రేకింగ్ వాటర్ సిస్టం పనులు పూర్తికావటంతో బోట్ల రాకపోకలు సాగుతున్నాయి. భవన నిర్మాణాలు, ఫిషింగ్ బోర్డు పనులు జరుగుతున్నాయి. త్వరలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– నాగమహేష్, పనుల పర్యవేక్షణ అధికారి
నిజాంపట్నం హార్బర్ రెండో దశ నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది. సముద్ర తీర ప్రాంతాలను అభివృద్ధి చేసి మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచాలన్న గత ప్రభుత్వ ఆశయానికి కూటమి సర్కారు తూట్లు పొడుస్తోంది. ఎన్నికల నాటికి 70 శాతం పూర్తయిన హార్బర్ రెండో దశ పనులను ఇప్పటి ప్రభుత్వం విస్మరించింది.
హార్బర్‌కు కూటమి గ్రహణం
హార్బర్‌కు కూటమి గ్రహణం
హార్బర్‌కు కూటమి గ్రహణం
Comments
Please login to add a commentAdd a comment