పిట్ట కొంచెం.. ‘ఆట’ ఘనం!
పెదకాకాని: చదువుతో పాటు క్రీడల్లోనూ శ్రీలక్ష్మి రాణిస్తూ మన్ననలు పొందుతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, వ్యాయామ ఉపాధ్యాయుడి శిక్షణతో ఫుట్‌బాల్‌లో రాణిస్తోంది. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతోంది. ఆమె క్రీడా ప్రతిభను గుర్తించిన కేంద్రం గతేడాది స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనేందుకు ఆహ్వానం కూడా పంపింది.
పెదకాకాని: మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన తాడిబోయిన తాతారావు, శాంతి దంపతుల చిన్న కుమార్తె శ్రీలక్ష్మి ప్రస్తుతం జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తాతారావు సాంఘిక నాటక రచయిత. శ్రీలక్ష్మి బాగా చదువుతోంది. బాలికలోని క్రీడా ప్రతిభను చూసిన వ్యాయామ ఉపాధ్యాయుడు వినయ్‌కుమార్ 8వ తరగతి నుంచే ఫుట్‌బాల్‌లో శిక్షణ ప్రారంభించారు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో సైతం సత్తా చాటుతోంది. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లిన శ్రీలక్ష్మి 13 నుంచి 17వ తేదీ వరకు ప్రోగ్రాంలో పాల్గొంది. క్రాఫ్ట్ సంస్థ నిర్వహించిన పోటీల్లో పాల్గొని ఢిల్లీలో జరిగిన బాలల హక్కులు, బాల కార్మికులు, బాల్యవివాహాలకు సంబంధించిన సెమినార్‌కు ఎంపికై ంది. గుంటూరు జిల్లాలో వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జరిగిన డిబేట్‌లో ప్రథమ స్థానం పొందింది. ఓటర్స్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి నుంచి ప్రశంసాపత్రం అందుకుంది. జిల్లా స్థాయిలో జరిగిన పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపి డీఈఓ సీవీ రేణుక నుంచి సర్టిఫికెట్ అందుకుంది.
ఐఏఎస్ కావడమే లక్ష్యం: శ్రీలక్ష్మి
ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. అన్నివిధాలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల రుణం తీరనిది. ఉపాధ్యాయులను ఎన్నటికీ మర్చిపోను. బాగా చదివి కలెక్టర్ కావాలన్నదే నా లక్ష్యం. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు.
జాతీయస్థాయి ఫుట్‌బాల్‌లో జిల్లా బాలిక ప్రతిభ చదువు, ఇతర పోటీల్లోనూ రాణిస్తున్న శ్రీలక్ష్మి జిల్లా ఉన్నతాధికారుల నుంచి పలు ప్రశంసాపత్రాలు
పిట్ట కొంచెం.. ‘ఆట’ ఘనం!
పిట్ట కొంచెం.. ‘ఆట’ ఘనం!
Comments
Please login to add a commentAdd a comment