మా భూములు చూపించండి సారూ
సంతమాగులూరు (అద్దంకి): తమకు పూర్వార్జితంగా సంక్రమించిన భూమిని చూపాలని కోరుతూ గ్రామానికి చెందిన అర్వపల్లి కుటుంబీకులు శుక్రవారం సంతమాగులూరు మండల తహసీల్దార్ రవిబాబుకు వినతిపత్రం అందజేశారు. సంతమాగులూరు మండలంలో భూ రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఆక్రమణదారులు పెచ్చుమీరుతున్నారు. ఇతరుల భూమిని సైతం తప్పుడు రికార్డులు సృష్టించి తమ పేరుతో ఆన్‌లైన్ చేయించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో సర్వే నంబరు 171/1లో తమకు పూర్వార్జితంగా సక్రమించిన 3.50 ఎకరాల భూమి తమ పేరుతో లేకుండా పోయిందని సంతమాగులూరులోని అర్వపల్లి ఇంటిపేరు కలిగిలిన అర్వపల్లి రత్నారావు, వెంకటనారాయణ, పిచ్చయ్య, రామారావు, శ్రీనివాసరావు తదితరులు వాపోయారు. తమ రికార్డుల ప్రకారం సర్వే చేయించి భూమిని ఎవరు ఆక్రమించారో గుర్తించి ఆన్‌లైన్ చేయాలని.. తమకు ఆ భూమి ఎలా తమకు సక్రమించిందో చూపే పత్రాలను తహసీల్దార్‌కు అందజేశారు. తహీల్దారు విచారణలో ఈ సర్వే నంబరుకు సంబంధించి ఆర్‌ఎస్‌ఆర్ ప్రకారం ఆయా భూములు కలిగిన పట్టాదారుల రికార్డుల విచారణతో పూర్తి వివరాలు వెలుగు చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment