అందరి బాధ్యత
పరిసరాల పరిశుభ్రత
లక్ష్మీపురం: శనివారం ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’లో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయంలో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ. భార్గవ్ తేజ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ఎస్‌కే ఖాజావలిలు పాల్గొన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులతో కలిసి కలెక్టరేట్ ప్రాంగణంలో వ్యర్థాలను శుభ్రం చేశారు. పౌర సరఫరాల కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. పరిశుభ్రత కార్యక్రమాలను నిరంతరం పాటిస్తామని ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యాలయాలను, పరిసర ప్రాంగణాలను శుభ్రంగా ఉండేలా అధికారులు ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కలెక్టరేట్ ఏవో పూర్ణ చంద్రరావు, మత్స్య శాఖ డీడీ గాలిదేముడు, డీపీఓ సాయికుమార్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీందర్, జిల్లా భూగర్భ జలవనరుల శాఖ ఉప సంచాలకులు వందనం, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment